
నిన్న ఈ సినిమాలోని ఆర్టిస్టుల కోసం ఈ నెల 15న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు. బెంగళూరు, చెన్నై నగరాలలో కూడా త్వరలో ఆడిషన్స్ ఉంటాయి. అది అలా ఉండగా.. ఈ సినిమాలో రెండు ప్రధాన పాత్రలలో రానా దగ్గుబాటి, మోహన్ లాల్ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
బాహుబలిలో ప్రభాస్ రానాలు కలిసి నటించారు. మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో తెలుగులో జనతా గ్యారేజ్, మనమంతా అనే సినిమాలలో నటించారు. ఆయన ఉంటే సినిమాకు మలయాళంలో కూడా బాగా మార్కెట్ పెరుగుతుంది. మరోవైపు… గతంలో కన్నడ లో ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం అనే సినిమా ప్రభాస్ తో తీస్తాడని వార్తలు వచ్చాయి.
2014లో విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అందులో హీరో కూడా ఒక గ్యాంగ్ లీడర్ గానే కనిపిస్తాడు. ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉండే కంప్లీట్ మాస్ చిత్రం ఉగ్రం. ఆ కథ తోనే ఈ సలార్ అనే సినిమా చేస్తున్నారా అనేదాని మీద క్లారిటీ లేదు
Chandrababu Naidu has sent a clear message to TDP rebels: withdraw your nominations or face…
కూటమి పొత్తుకు విఘాతం కలగకుండా స్థానిక ఎన్నికలు సజావుగా సాగాలని, పొత్తులో భాగంగా టీడీపీ శ్రేణులు రాజకీయ త్యాగాలకు సిద్ధం…