Telugu

బాబు ముందుకొచ్చారు మరి పవన్….?

కూటమి పొత్తుకు విఘాతం కలగకుండా స్థానిక ఎన్నికలు సజావుగా సాగాలని, పొత్తులో భాగంగా టీడీపీ శ్రేణులు రాజకీయ త్యాగాలకు సిద్ధం కావాల్సిందే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ క్యాడర్, లీడర్లకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు.

పొత్తులో భాగంగా మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ పార్టీలకు కేటాయించిన సీట్లలో టీడీపీ నుంచి ఎటువంటి రెబల్ అభ్యర్థులు నామినేషన్ వేయకూడదని, కాదని ఎవరైనా పొత్తు ధర్మాన్ని దాటి ముందుకెళితే పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు.

ADVERTISEMENT

పొత్తులో భాగంగా తమకు ఆశించిన సీటు దక్కలేదని కొందరు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఇండిపెంట్ గా నామినేషన్ వేసేందుకు, రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతూ పార్టీ అధినేతలకు తమ డిమాండ్లు వినిపిస్తున్నారు.

వీరి వాదన కూటమి పొత్తుకు తలనొప్పిగా మారుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేతగా బాబు తన పార్టీ శ్రేణులను బుజ్జగించేందుకు, హెచ్చరించేందుకు ముందుకొచ్చారు. ఇక్కడ పార్టీ రాజకీయ ప్రయోజనాల కన్నా, నాయకుల వ్యక్తిగత అవసరాల కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత కీలకం అని,

ఇందుకోసం పార్టీ నేతల త్యాగాలతో పాటుగా సహకారం కూడా అవసరమని, అందుకోసం పార్టీ నేతలందరూ కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మూడు పార్టీ నేతల గెలుపు కోసం ముందుకురావాలని, 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల వంటి ఫలితాలతో కూటమి బంధాన్ని మరింత బలపరచాలని టీడీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు.

అయితే కూటమిలో భాగమైన టీడీపీ పార్టీ అసంతృప్తులను గాడిన పెట్టేందుకు పార్టీ అధినేత బాబు తన వంతుగా కూటమి బంధం బలోపేతానికి ముందుకొచ్చి పొత్తు ధర్మానికి కట్టుబడాల్సిందే అంటూ తన పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఇటువంటి తరుణంలో అటు జనసేన లో అసంతృప్తి నేతలను దారిలో పెట్టేందుకు, జనసైనికుల ఆవేశాన్ని చల్లార్చి వారిని కూటమి పొత్తు వైపుకి మళ్లించేందుకు పవన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే జనసైనికులు, పవన్ అభిమానులు పార్టీ ప్రస్తుత పరిస్థితి పై మంత్రి నాదెండ్ల ని నిందిస్తున్నారు. ఆయన పై సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని, అక్కసును వెళ్లగక్కుతున్నారు.

అలాగే ఇటు టీడీపీ పై కూడా అపనమ్మకంతో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ శ్రేణులలో ఉన్న అన్ని అనుమానాలకు చెక్ పెట్టేలా, స్థానిక ఎన్నికలలో గాజు గ్లాసు గెలుపుతో పాటుగా పసుపు సైకిల్, కాషాయ కమలం విజయం కూడా మన బాధ్యత అనేలా తన పార్టీ శ్రేణులకు ఎందుకు దిశా నిర్దేశం చేయలేకపోతున్నారు. పవన్ మౌనం వెనుకున్న ఆ సందేశం ఏమై ఉంటుంది.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pawan Kalyan’s Silence Shocks Janasena Leaders

Chandrababu Naidu has sent a clear message to TDP rebels: withdraw your nominations or face…

2 minutes ago

నేటి ఫలితాలు రేపటి ప్రతిబింబాలు కావు…

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక ఎన్నికలు టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణానికి తెరలేపాయి. అయితే ఇక్కడ అధికారం…

17 minutes ago