
ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని మోస్ట్ వయొలెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఇది రూపొందుతోందనే పెద్ద టాకే ఉంది. ముందు అనుకున్న ఆగస్ట్ 11 కాకుండా డిసెంబర్ 1కి యానిమల్ ని వాయిదా వేయడం నలుగురు స్టార్ లను హమ్మయ్య అనుకునేలా చేసింది. చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్ లు తెలుగు తమిళ రాష్ట్రాల సంగతి పక్కనపెడితే రన్బీర్ కపూర్ వల్ల ఉత్తరాది మార్కెట్ లో ఓపెనింగ్స్ ని తగ్గించుకోవాల్సి వచ్చేది.
హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని మల్టీప్లెక్సులు యానిమల్ కే ప్రాధాన్యత ఇచ్చేవి. టి సిరీస్ కున్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ అలాంటిది. అందుకే ఓ పెద్ద గండాన్ని మెగా స్టార్ సూపర్ స్టార్ లు తప్పించుకున్నట్టే. అటు బాలీవుడ్ లోనూ ఇదే సీన్ ఉంది. సన్నీ డియోల్ గదర్ 2కు బిజినెస్ బాగా జరుగుతోంది. యానిమల్ వల్ల ఏ సెంటర్స్ వసూళ్లకు చిల్లు పడుతుందేమోనని భయపడిన జీ స్టూడియోస్ కి ఇది పెద్ద రిలీఫ్.
ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఇరవై ఏళ్ళ తర్వాత రూపొందుతున్న సీక్వెల్ కావడంతో కొత్త జనరేషన్ అంత సులభంగా కనెక్ట్ కాలేరు. ఇక అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 సైతం ఆగస్ట్ 11కే వస్తోంది. అసలే వరస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ సీనియర్ హీరోకు సపోర్ట్ కావాలంటే యానిమల్ లాంటి ట్రెండీ కంటెంట్ రేస్ లో లేకపోవడమే మంచిది.
ఒకరకంగా చెప్పాలంటే ఇది టాలీవుడ్ గర్వించదగ్గ విషయమే. యానిమల్ మీదున్న నేషనల్ వైడ్ హైప్ ఏంటో అర్థమయ్యింది. సందీప్ ఏదో మేజిక్ చేస్తాడనే నమ్మకం ఆడియన్స్ లో బలంగా ఉంది. మాఫియా డాన్ అయిన తండ్రిని అన్యాయంగా చంపిన వాళ్ళ మీద లెక్చరరైన కొడుకు మృగంలా మారి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పాయింట్ తో యానిమల్ రూపొందిందట.
ఫాదర్ క్యారెక్టర్ లో అనిల్ కపూర్, విలన్ గా బాబీ డియోల్ నటించిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామాకు రష్మిక మందన్న హీరోయిన్ కావడం సౌత్ మార్కెట్ పరంగా హెల్ప్ అవుతోంది. లైన్ పరంగా కొత్తగా అనిపించకపోయినా ట్రీట్మెంట్ మాత్రం అగ్రెసివ్ గానే ఉంటుంది. అందుకే యూత్ లో ఇన్నేసి అంచనాలు. మొత్తానికి యానిమల్ తప్పుకోవడం నలుగురు స్టార్లకు పెద్ద టెన్షన్ తప్పించేసింది.
New data is showing that H-1B petitions from Indian companies in the US have dropped…
Amyaela is setting the internet ablaze with a breathtaking new photoshoot that totally redefines modern…