
అయితే ఉన్నట్టుందడి రణబీర్ కపూర్ ఈ చిత్రానికి నో చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై చిత్ర నిర్మాతలు క్లారిఫికేషన్ ఇచ్చారు. “రణబీర్ కు సందీప్ తో పని చెయ్యాలని ఉంది. అయితే పూర్తి స్క్రిప్ట్ చదివే ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు. సందీప్ మరో 15 రోజులలో స్క్రిప్ట్ పూర్తి చేసి రణబీర్ కు వినిపిస్తాడు,” అని వారు ప్రెస్ కు ఒక లీక్ ఇచ్చారు.
ఇది ఒక క్రైమ్ డ్రామా అని సమాచారం వస్తుంది. ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదట. రణబీర్ సింగ్ చేతిలో ఇప్పటికే బ్రహ్మాస్త్ర, శంషేరా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ రెండూ పూర్తి అయ్యాకే సందీప్ వంగా ప్రాజెక్టు తెరమీదకు వెళ్తుంది.
ఇటువంటి సమయంలో రణబీర్ అర్జెంటుగా ఈ కథ వినాల్సిన అవసరం లేదు. సందీప్ కు వీలైనంత సమయం ఇచ్చి కథ ఒకే చెయ్యవచ్చు. దానితో ఈ సినిమాపై అనుమానాలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే సినిమాను 2020 చివరిలో గానీ లేక 2021 స్టార్టింగ్ లో గాని ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త భయానక వాతావరణం మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో కనిపిస్తోంది. ఇంతవరకు జరిగిన, ఇంకా…
The deputy CM of Andhra Pradesh, Pawan Kalyan has another facet and it is regarding…