
అయితే వారి అంచనాలకు మించే విధంగా చెర్రీ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇటీవల కాలంలో మన తెలుగు హీరోలు ఎవరూ కనిపించనంత మాస్ లుక్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా లీక్ అయిన ఆన్ సెట్స్ ఫోటోలు కూడా బలపరుస్తున్నాయి. లుంగీ కట్టుకుని, గడ్డం పెంచుకుని ఉన్న చెర్రీ లుక్స్, మాస్ మెగా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించే ఉంది.
చూడబోతుంటే… చెర్రీ కెరీర్ లో “రంగస్థలం” ఓ డిఫరెంట్ సినిమాగా నిలిచిపోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మహేష్ కు “1 నేనొక్కడినే,” జూనియర్ ఎన్టీఆర్ కు “నాన్నకు ప్రేమతో” వంటి డిఫరెంట్ సినిమాలను ఇచ్చిన సుక్కూ… చెర్రీకి “రంగస్థలం”తో మరో ఇమేజ్ ను తీసుకువచ్చేలా కనపడుతున్నాడు. ఒకప్పుడు ఏఎన్నార్, కృష్ణలు మాత్రమే పూర్తి స్థాయి క్యారెక్టర్లు లుంగీలో చేసారు. వాళ్ళ తర్వాత చెర్రీనే ఈ ఫీట్ ను సాధించే విధంగా కనపడుతున్నాడు మరి!
Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…
Andhra Pradesh chief minister, Chandrababu Naidu has been fully committed and dedicated towards the completion…