
ఇక బెంగాలీ బ్యూటీ రాణి ముఖర్జి.. ఆదిత్య చోప్రా ల ప్రేమ ముచ్చట ఒకెత్తు. హీరోయిన్ గా రాణి ముఖర్జి టాలెంటెడ్ యాక్టరెస్. యశ్ రాజ్ తనయుడు ఆదిత్య చోప్రా ను .. రాణి ముఖర్జి ల ప్రేమ .. పెళ్లి తో ముగిసింది. వాస్తవంగా పెళ్లి తరువాత రాణిముఖర్జి చిత్రాలు చేయడం తగ్గించింది. అప్పడప్పుడు తన మామగారి బ్యానర్ లో నటిస్తుంది. రెండు సంవత్సరాల క్రితం మర్ధానీ చిత్రంలో పవర్ ఫుల్ లేడి పోలీసాఫీసర్ గా నటించి మెప్పించింది. ఆ తరువాత రాణి ముఖర్జి, ఆదిత్య చోప్రా పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చారు. 2015 తరువాత రాణి ముఖర్జి తల్లి కావడంతో సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా పాపకు రెండు సంవత్సరాలు నిండడంతో .. రాణి ముఖర్జి కమ్ బ్యాక్ కు సిద్దం అయ్యింది. యశ్ రాజ్ బ్యానర్ లో `హిచ్కీ`చిత్రంతో కమ్ బ్యాక్ కు రంగం సిద్దం అయ్యింది.
ఇదిలా వుంటే సోషల్ నెట్ వర్క్ కు సంబంధించి రాణి ముఖర్జి తన అభిప్రాయం కుండ బద్దలు కొట్టినట్లు మీడియాకు తెలిపింది. తను గానీ..తన భర్త ఆదిత్య చోప్రా గాని సోషల్ నెట్ వర్క్ లో పెద్దగా యాక్టివ్ గా ఉండమని తెలిపింది. వ్యక్తి గత విషయాలు ప్రవైట్ గా ఉంచడానికే ఇష్టపడతామని.. ప్రతి విషయం సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేయడం అనేది నచ్చదని చెప్పింది. ఇక ఫ్యామిలీ ఫోటోలాంటివి సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేయడం అనే విషయాన్ని తను అసలు ఊహించలేనని చెప్పింది . సోషల్ నెట్ వర్క్ అంటే తాము వ్యతిరేకం కాదు కానీ..తమ వరకు సోషల్ నెట్ వర్క్ కు దూరంగా ఉండటానికే ఇష్టపడతామని క్లారీటి ఇచ్చింది. ఎవరి ఇష్టాలు వారివి కదా.నిజమే మరి.!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…