Telugu

రావు బహదూర్ సినిమా రివ్యూ: సెటైర్ ని డైల్యూట్ చేసిన కంగాళీ కథనం!

చిత్రం: రావు బహదూర్

M9 రేటింగ్: 2.5 /5

ADVERTISEMENT

విడుదల తేదీ: జూలై 03, 2026

తారాగణం: సత్యదేవ్, వికాస్ ముప్పల, దీపా థామస్ తదితరులు

నిర్మాణ సంస్థ: A+S మూవీస్ – శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ – మహాయాన మోషన్ పిక్చర్స్ – బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్

దర్శకత్వం: వెంకటేష్ మహా

సంగీతం: స్మరణ్ సాయి

నిర్మాత: అనురాగ్ రెడ్డి – శరత్ చంద్ర – చింతా గోపాలకృష్ణా రెడ్డి – ఈశ్వరన్ విజయరాఘవన్

ఛాయాగ్రహణం: కార్తీక్ పర్మార్

కూర్పు: వెంకటేష్ మహా

“కేరాఫ్ కంచర్లపాలెం” ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “రావు బహదూర్”. సత్యదేవ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాని మహేష్ బాబు సమర్పించడం అనేది పబ్లిసిటీ పాయింట్ గా నిలిచింది. సైకలాజికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం మునుపెన్నడూ లేని విధంగా తెలుగు సినిమాని ఎక్స్ పీరియన్స్ చేసేలా ఉంటుంది అని ప్రమోట్ చేశారు టీమ్. మరి సినిమా నిజంగానే ఆ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందా? లేదా? అనేది చూద్దాం..!!

కథ:

భువనం రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) లివర్ క్యాన్సర్ తో ఎప్పుడో చనిపోవాల్సి ఉండగా.. అతడి మస్తిష్కంలో పురుగులా తిరుగుతున్న ఓ అనుమానం కారణంగా బ్రతికే ఉంటాడు. ఏమిటా అనుమానం? దానికి సమాధానం దొరికిందా? అందుకోసం ఎన్నెన్ని చిన్నెలు పడ్డాడు? ఆ సమాధానాన్ని రామప్ప జీర్ణించుకోగలిగాడా? అనేది “రావు బహదూర్” కథాంశం.

నటీనటుల పనితీరు:

సత్యదేవ్ ప్రాణం పెట్టి జీవించాడు. బాడీ లాంగ్వేజ్, హావభావాలు, నడక ఇలా అన్నీ విషయాల్లోనూ అత్యద్భుతమైన కేర్ తీసుకున్నాడు. ఈ పాత్రలో సత్యదేవ్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. సత్యదేవ్ తర్వాత అతడి స్థాయిలో, ఒక్కోసారి అతడ్ని డామినేట్ చేసే స్థాయిలో నటించిన వ్యక్తి వికాల్ ముప్పల. కనిపించడానికి చాలా నార్మల్ క్యారెక్టర్ అనిపిస్తుంది కానీ.. చాలా ఎమోషనల్ బ్యాగేజ్ మోయాల్సిన పాత్ర అది. చాలా బ్యాలెన్స్డ్ గా ప్లే చేశాడు. దీప థామస్ కూడా తనదైన నటనతో పాత్రతో కనెక్ట్ అయ్యేలా చేసింది. సినిమాలో చిన్న పిల్లాడు కూడా చక్కగా నటించాడు.

సాంకేతికవర్గం పనితీరు:

ఆర్ట్ & కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వర్క్ ను ముందుగా మెచ్చుకోవాలి. 1960 మరియు 1990 కాలాన్ని తెరపై చాలా సహజంగా ప్రెజంట్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్మరణ్ సాయి సంగీతం సినిమాకి ప్లస్ అయ్యి.. సినిమాలోని కంటెంట్ ని బాగా ఎలివేట్ చేసింది.
ఒక రచయితగా, దర్శకుడిగా సినిమాకి ఆయువుపట్టుగా నిలిచిన వెంకటేష్ మహా.. ఒక ఎడిటర్ గా మాత్రం న్యాయం చేయలేకపోయాడు. రచయిత-దర్శకుడు-ఎడిటర్ ఒకరే అయితే.. జడ్జిమెంట్ అనేది గాడితప్పుతుంది. రాసుకున్న సన్నివేశాల మీద ప్రేమ వల్లనో, ఎడిట్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు నేను రాసింది ఆడియన్స్ ఆమాత్రం అర్థం చేసుకోలేరేంటి అనే ఆలోచనలో చేసే తప్పులు ఫస్టాఫ్ లో స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల.. దర్శకుడిగా వెంకటేష్ మహా సినిమాలో చూపించిన కొన్ని మెటాఫర్స్ ను ఎంతలా మెచ్చుకోవాలి అనిపించేలా ఉన్నా.. సదరు అంశాలను పేర్చుకుంటూ వెళ్లిన విధానం ఎంగేజింగ్ గా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. దాని కారణంగా రెండు గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులు థియేటర్లో ఓపిగ్గా కూర్చోలేక ఇబ్బందిపడతారు. ఎడిటింగ్ అనే క్రాఫ్ట్ మాత్రం వేరొకరికి అప్పిగించి ఉంటే బాగుండేది.
అయితే.. రచయతగా, దర్శకుడిగా వెంకటేష్ మహా ఆలోచనలు, తెరపై అతడు చిక్కిన సన్నివేశాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ముఖ్యంగా గోడ మీద ఫోటో ఫ్రేముల సీక్వెన్స్, గుమ్మడికాయ సీక్వెన్స్ యొక్క అర్థం రివీల్ అయ్యాక ఎంత అద్భుతంగా రాసుకున్నాడు అని మెచ్చుకోకుండా ఉండలేం. అలాగే.. ఒక్క సన్నివేశం, ఒక్క పాత్ర, ఒక్క డైలాగ్ కూడా అనవసరం అనిపించదు. కాకపోతే.. అవన్నీ ప్రేక్షకులు అనుభూతి చెందే సహనాన్ని మాత్రం ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంటాడు వెంకటేష్.

విశ్లేషణ:

పాపులర్ బాలీవుడ్ యాక్టర్ నసీరుద్దీన్ షా ఒకసారి ఇలాంటి సినిమాలు చూడాలి అనే విషయమై మాట్లాడుతూ.. “ఎప్పుడూ కేవలం ఎంటర్టైన్ చేసే సినిమాలు మాత్రమే కాదు.. మెదడుకు పని పెట్టే, ఆలోచింపజేసే సినిమాలు చూస్తూ ఉండాలి” అని అన్నారు. “రావు బహదూర్” సరిగ్గా అలాంటి సినిమానే. సినిమా మొత్తం చూసి బయటికి వచ్చి.. సినిమా చూసిన మరొకరితో డిస్కస్ చేస్తే చాలా పాయింట్స్ వస్తాయి కానీ.. థియేటర్ బయటకి వచ్చిన తర్వాత మాత్రం ఒక సంతృప్తినివ్వలేకపోయింది. సరదాగా టైంపాస్ కోసం చూస్తాను అనుకునేవాళ్ళకి ఇది సరైన సినిమా కాదు. సినిమా చూస్తూ ప్రతి విషయాన్ని గమనిస్తూ.. ఫలానా సీన్ లో ఫలానా డీటెయిల్ ఉంది అని గుర్తుపెట్టుకొని చూసేవాళ్ళకి మాత్రం నచ్చుతుంది.

ఓవరాల్ గా.. సెటైర్ ని డైల్యూట్ చేసిన కంగాళీ కథనం!

M9 రేటింగ్: 2.5/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

MS Subbulakshmi Amma Chose This Team

The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…

2 hours ago

“Feel So Bad for London:” Hindu Ritual in London Sparks Debate.

An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…

3 hours ago