Telugu

ఏపీ వైపు చూస్తున్న ఆటోమొబైల్ రంగం…

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరోకీలక శుభవార్తనే చెప్పాలి. రాష్ట్రానికి ఆటోమొబైల్ పరిశ్రమల పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కియా సంస్థను ఆకర్షించిన ఏపీ ఇప్పుడు ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థలను కూడా రాష్ట్రానికి రప్పిస్తుంది.

ఐటి మంత్రి నారా లోకేష్ చొరవతో, ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ విధానాలతో పరిశ్రమలు ఏపీ వైపు చుస్తున్నాయి. మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా హ్యుందాయ్, కియా అనుబంధ సంస్థలతో చర్చలు జరిపి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

ADVERTISEMENT

ఈ ప్రయత్నాల ఫలితంగా మూడు ఆటోమొబైల్ విడిభాగాల సరఫరా సంస్థలు ఏపీ వైపు మొగ్గుచూపాయి. అయితే ఈ పరిశ్రములు ముందుగా తమిళనాడు వైపు చూసినప్పటికీ తిరిగి ఏపీకి తరలివస్తున్నాయి. ఇందులో హ్వషిన్ సంస్థ రూ. 850 కోట్లు, సియోన్ రూ. 514 కోట్లు, ఐవామెట్ రూ. 250 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.

ఏపీలోని అనంతపురం జిల్లాలో మొత్తం ఈ మూడు సంస్థలు కలిపి రూ. 1600 కోట్ల పెట్టుబడులతో సుమారు1418 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి.

కీయ పరిశ్రమతో మొదలైన ప్రస్థానం…

ఇప్పటికే కియా కార్ల తయారీ పరిశ్రమతో అనంతపురం ప్రాంతం ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు దాని అనుబంధంగా విడిభాగాల తయారీ సంస్థలు కూడా రావడం ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఉతమవ్వనుంది.

ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా అనుబంధ పరిశ్రమలు, రవాణా, ఇతర వ్యాపార రంగాలు కూడా ప్రయోజనం పొందుతాయి. తమిళనాడు వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని కాదని దక్షిణ కొరియా సంస్థలు ఏపీ వైపు ఆకర్శించండం రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ఒక పెద్ద విజయంగా చెప్పవచ్చు.

రాయలసీమకు పారిశ్రామిక కళ…

ఇప్పటికే రాయలసీమ లో భాగమైన అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటు కావడంతో అంతర్జాతీయ స్థాయిలో అనంతపురానికి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు హ్వషిన్, సియోన్, ఐవామెట్ వంటి మూడు కీలక విడిభాగాల తయారీ సంస్థలు కూడా అనంతపురం వైపు చూడడంతో రాయలసీమ పారిశ్రామిక ప్రగతికి మరో కొత్త కళ వచ్చినట్లయ్యింది.

తమిళనాడుకి పోటీగా ఏపీ…

ఆటోమొబైల్ పరిశ్రమకు దేశంలోనే తమిళనాడు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాంటి రాష్ట్రం తో పోటీ పడే విధంగా ఏపీలో ఆటోమొబైల్ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం నిజంగా ఇది ఆంధ్రా పారిశ్రామిక ప్రగతికి ఒక మంచి శుభపరిణామం అనే చెప్పాలి.

దీనితో బటన్లు నొక్కడమే ప్రభుత్వం కాదని, సంక్షేమ పథకాలు పంచిపెట్టడమే పాలన అవదని, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ, ప్రజల మౌలిక అవసరాలను తీర్చుతూ, అభివృద్ధి – సంక్షేమం రెండు జోడేడ్ల బండ్లు లా ముందుకు తీసుకెళ్లడమే నిజమైన అధికారానికి అర్ధం అంటున్నారు కూటమి మద్దతుదారులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

One Dance Changed Akash Puri’s Attitude!

Akash Puri made an interesting admission at the AH movie event while praising Rahul Vijay.…

7 minutes ago

Jagan’s Delayed Response to Rapthadu Incident Raises Questions

The man who fought so hard for the Leader of the Opposition post took two…

22 minutes ago