
నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా చాలా మంది తమ జీవితాలకు మార్గదర్శనం చేసిన తండ్రిని గుర్తు చేసుకొని కుదిరితే కానుకలో లేకుంటే శుభాకాంక్షలో తెలియజేస్తుంటారు.
దేశ ప్రజల జీవితాలలో మరో సౌకర్యం జోడించి నిత్యం లక్షలాది మందిని సురక్షితంగా తమ గమ్య స్థానాలు చేరుస్తూ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ర్యాపిడో సంస్థ ‘ఫాదర్స్ డే’ సందర్భంగా అద్భుతంగా తండ్రి గొప్పదనం వివరిస్తూ, శుభాకాంక్షలు తెలియజేసింది.
ర్యాపిడో యాప్‌లో బుక్ చేయగానే బైక్, ఆటో, లేదా కారు మన ఇంటి వద్దకు వచ్చి మనల్ని పికప్ చేసుకొని సురక్షితంగా మన గమ్యం స్థానాలు చేరుస్తుంటుంది.
“కానీ ర్యాపిడో కంటే దశాబ్దాల క్రితమే ప్రతీ తండ్రి తన పిల్లలని ఇంటి నుంచి స్కూలుకి చేర్చేవాడని దానిలో పేర్కొంది. ఆయన ఏనాడూ ఓటీపీ అడగలేదు. ఏనాడూ రైడ్ క్యాన్సిల్ చేయలేదు. సులువుగా గమ్యస్థానం చేర్చగలరు. ముఖ్యంగా ఆయన ఎల్లప్పుడూ భద్రతనిస్తారు.
ర్యాపిడో కంటే ముందు మీ నమ్మకమైన రైడ్ మీ తండ్రి మాత్రమే,” అంటూ స్కూలుకు బయలుదేరుతున్న కొడుకు కోసం ఇంటి గేటు వద్ద స్కూటర్‌పై వేచి చూస్తున్న తండ్రి ఫోటో పెట్టింది ర్యాపిడో సంస్థ.
తండ్రి-పిల్లల భావోద్వేగాన్ని, నమ్మకాన్ని, భద్రతని ర్యాపిడో ఇంత చక్కగా తమ సంస్థకు అన్వయించుకుంటూ పెట్టిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. నిజమే కదా తండ్రిని మించి ‘సేఫ్ రైడ్’ ఎవరు ఇవ్వగలరు? అలాంటి సేఫ్ రైడ్ మేము ఇస్తున్నామని ర్యాపిడో ఇంత చక్కగా చెప్పుకోవడం ముచ్చటగా ఉంది కదా?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…