
Lakshmi's Courage During the Rapthadu Girl Attack
రాప్తాడు లో ఒక బాలిక మీద హేమంత్ అనే ఉన్మాది రంపంతో చేసిన దాడి ఒక ‘ఉన్మాదానికి’ నిదర్శనంగా మారినట్టే ఒక ‘స్నేహానికి’ కూడా సాక్షం గా నిలిచింది. అయితే ఇక్కడ బాలిక మీద హేమంత్ చేసిన దాడి ఉన్మాదం అయితే ఆ బాలిక ప్రాణాలు కాపాడడానికి తోటి బాలిక చూపించిన చొరవ తెగింపు ఆమె స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ఎలక్ట్రిక్ రంపం చేతిలో పట్టుకుని విచక్షణారహితంగా హేమంత్ సదరు బాధిత బాలిక మీద దాడికి తెగబుతుంటే పక్కనే ఉన్న లక్ష్మి అనే మరో బాలిక తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, తన స్నేహితురాలి ప్రాణాలు రక్షించేందుకు చూపిన చొరవ పెద్ద సాహసమనే చెప్పాలి.
హేమంత్ చేసిన దారుణకాండకు ఉపాధ్యాయులే తేరుకోలేకపోయిన పరిస్థితులలో, తోటి సహా విద్యార్థులు భయపడి వెనక్కి వెళ్లిన తరుణంలో ఆ బాలిక ధైర్యం చేసి ఒక ఉన్మాదికి వ్యతిరేకంగా అడుగు ముందుకేసింది. తన ఆ ఒక్క అడుగు బాధిత బాలిక ప్రాణాలు రక్షించగలిగింది, అలాగే తన ప్రాణాల మీదకు తెచ్చింది.
హేమంత్ దాడి నుంచి ఆ బాలికను కాపాడే ప్రయత్నంలో ముందుకొచ్చిన లక్ష్మి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుంది. హేమంత్ యూ అక్కడే చంపకుండా ఎందుకు చికిత్స అందిస్తున్నారంటూ ప్రశ్నిస్తుంది. లక్ష్మి కళ్ళ ముందు తన స్నేహితురాలి పై జరిగిన ఆ దారుణం ఆమెను శారీరకముగానే కాదు మానసికంగానూ కుంగతీస్తుంది.
అయితే మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా లక్ష్మి స్నేహం, ధైర్యం ని ప్రశంసిస్తూ తన ఈ సాహసానికి తనకు తన కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందంటూ, లక్షి త్వరిత గతిన కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి తన చదువు కొనసాగించాలని లోకేష్ లక్ష్మికి అండగా తన X లో పోస్ట్ పెట్టారు.
అలాగే అటు రాప్తాడు బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి పై కూడా లోకేష్ ఒక మంచి అప్ డేట్ ఇచ్చారు. బాలిక ప్రస్తుతానికి కోలుకుంటుందని, సృహలోకి వచ్చిందని, బాలిక తల్లి ఆమెను పలకరించి వచ్చిందని, ఈ రోజు సాయంత్రం లోపు ఆమెకు అమర్చిన వెంటిలేటర్ ను కూడా డాక్టర్లు తొలగించే అవకాశముందని, బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నట్టు తన X లో పోస్ట్ చేసారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనలో ఉన్మాదిగా ఉన్న హేమంత్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు హేమంత్ పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న హేమంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తన రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలు కావడంతో ఆయన కాలు తొలగించే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు.
అయితే హేమంత్ నిజంగా ఆ శిక్షకు పూర్తి అర్హుడే అంటున్నారు ప్రజలు. ఒక చిన్నారి ప్రాణాన్ని లెక్కచేయకుండా తన ఉన్మాదంతో ఆమెను బతికున్నా సాధారణ జీవితం గడపలేని నిస్సహాయురాలిగా మార్చి, ఆ తల్లితండ్రుల కడుపుకోతను కారణమయ్యి, అడ్డొచ్చిన మరో బాలిక మీద దాడి చేసి చివరికి ఎం సాధించినట్టు.?
The police firing on Hemanth, accused of attacking a Class 10 girl at a government…
The makers of S Krishna’s directorial venture HIGH have released Dammulunte, a promotional song aimed…