Telugu

కాస్టింగ్ కౌచ్… కెరీర్ బాగుంటే తప్పేం లేదన్న హీరోయిన్..!

“అంతకుమించి” చిత్రంతో తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జబర్దస్త్’ యాంకర్ కం హీరోయిన్ గా మారిన రష్మి, టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’పై ఏ మాత్రం జంకు లేకుండా సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశం కోసం వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ మాత్రమేనని, దాన్ని తాను గౌరవిస్తానని చెప్పిన రష్మి, కెరీర్ బాగుంటుందనిపిస్తే, కాస్టింగ్ కౌచ్ కి అంగీకరించడంలో తప్పేమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

[m9ad]

ADVERTISEMENT

ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మికి, మీడియా నుంచి కాస్టింగ్ కౌచ్ పై స్పందించాలంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఇది ఇద్దరి వ్యక్తిగత విషయమని, వారిద్దరి అంగీకారంతోనే జరుగుతుందని అంది. దాన్ని కాస్టింగ్ కౌచ్ అని ఎలా చెప్పగలమని ప్రశ్నించింది. ఆ బంధాన్ని వాళ్లు ఎంజాయ్ చేసి, ఆపై బయటకు వచ్చి గొడవ చేయడం ఏంటని అడిగింది. అవకాశాలు ఇస్తామంటే, ఆశపడి వెళ్లిన తరువాత, మళ్లీ గోల పెట్టాల్సిన అవసరం లేదని రష్మి కుండబద్ధలు కొట్టింది.

ప్రతి రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని, కానీ, సినిమా ఇండస్ట్రీనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని ఆరోపించింది. తనతో మాత్రం ఏ నిర్మాత కూడా తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది. నిర్మాతలతో తనకు రెమ్యునరేషన్ విషయంలో తప్ప, ఏ ఇతర విషయాలలో విభేదాలు రాలేదని పేర్కొంది. కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది హీరోయిన్లు చెప్పారు గానీ, రష్మి లాగా ఇంత బోల్డ్ గా, ప్రాక్టికల్ గా మాట్లాడిన హీరోయిన్లు లేరనే చెప్పాలి. అందుకే రష్మి వ్యాఖ్యలు సంచలనంగా నిలిచాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

జనసేన బలపడేందుకు మరో పాతికేళ్ళు .. సైనిక్స్ అంత ఓపిక ఉందా?

ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ చెప్పిన…

16 minutes ago

Varanasi: Huge Hype, But Are the Deals Big Enough?

SS Rajamouli’s Varanasi is still months away from its April 7, 2027 release, but discussions…

28 minutes ago