
రావెల చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో 2017వరకు మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జనసేనకు గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరారు. మళ్ళీ ఇప్పుడు దానికీ గుడ్ బై చెప్పేసారు.
రాష్ట్రంలో టిడిపి మళ్ళీ బలం పుంజుకొని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతుండటంతో వచ్చే ఎన్నికలలో టిడిపికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించి మళ్ళీ పార్టీ గూటికి చేరుకోవాలనుకొంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఆయనకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే, ఆయన పార్టీని వీడి వెళ్ళిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడును, టిడిపిని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేసినందున, టిడిపి శ్రేణులు ఆయన రాకకు సుముఖంగా లేవని తెలుస్తోంది. మరి ఆయన టిడిపిలో చేరేందుకే బిజెపికి రాజీనామా చేసి బయటకు వచ్చారా లేక నిజంగానే వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే రాజీనామా చేశారా? అనేది త్వరలోనే ఆయన కార్యాచరణతో తేలిపోతుంది.
Rajinder Kumar, a 32-year-old Indian truck driver, has been transferred from federal immigration custody to…
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…