
మనం చెప్పే మాటలు మన చేతలకి తగ్గట్లుగా ఉండాలి కానీ.. మాటలు కోటలు దాటి.. చేతలు గడప దాటనట్లుగా ఉండకూడదు అని పెద్దోళ్లు ఊరికే అనలేదు. అది ఎంత నిజం అనేది రవిబాబు విషయంలో ప్రూవ్ అయ్యింది.
గత కొన్ని వారాలుగా పొలోమని ఇంటర్వ్యూలు ఇస్తూ ఇండస్ట్రీ మొత్తాన్ని కడిగిపారేసిన రవిబాబు తీసిన తాజా చిత్రం “రేజర్” నిన్న విడుదలైంది.
తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి కూడా 10 లక్షల గ్రాస్ వసూలు చేయలేకపోయిన “రేజర్” చిత్రం చూసిన అతి తక్కువ మంది ప్రేక్షకులు కూడా ఈసడించుకున్నారు.
పాయింట్ పరంగా బాగున్నా.. సినిమాని తీసిన విధానం ప్రేక్షకుల్ని కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ మరియు సీజీ వర్క్ షార్ట్ ఫిలిమ్స్ స్థాయిలో ఉన్నాయి.
సినిమాలో లాజిక్కులు గురించి తెగ క్లాసులు పీకిన రవిబాబు “రేజర్”లో లాజిక్కును తుంగలో తొక్కి.. ఇష్టమొచ్చినట్లుగా కథనాన్ని నడిపించిన తీరు హాస్యాస్పదం కాగా.. అతి తక్కువ బడ్జెట్ లో సినిమాని ముగించడం కోసం గ్రీన్ స్క్రీన్ ని వాడిన తీరైతే తెర మీద స్పష్టంగా కనిపించింది.
తాను తీసి, నటించిన సినిమాలో ఇన్ని లొసుగులు, లొట్టలు పెట్టుకుని.. రవిబాబు ఇండస్ట్రీకి క్లాసులు పీకడం గురించి అందరూ నవ్వుకుంటున్నారు.
ఇదివరకు సినిమా ప్రారంభోత్సవం రోజునే.. చాలా నమ్మకంగా రిలీజ్ డేట్ లేదా మంత్ లేదా సీజన్ ప్రకటించేవారు దర్శకనిర్మాతలు. దాన్ని…
Salman Khan is preparing for a major comeback with his upcoming film directed by Vamshi…