Telugu

రవితేజ తమ్ముడు మందేసారని సాక్ష్యం!

ప్రముఖ సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, అంత్యక్రియలు పూర్తి చేయడం తదితర సంగతులు తెలిసినవే. అతి వేగంగా కారు నడపడంతోనే భరత్ ప్రమాదానికి గురై మరణించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు గానీ, భరత్ మద్యం సేవించారా? లేదా? అన్నది మాత్రం… పోస్ట్ మార్టం నివేదికపై వదిలేసారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి ముందు భరత్ నోవాటెల్ హోటల్ లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

శనివారం జరిగిన తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి భరత్ హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డయింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.25 గంటల వరకు ఆ హోటల్ లోనే ఉండగా, ఆ తర్వాత తన స్కోడా కారులో బయటకు వచ్చిన భరత్, రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాల్ గూడ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మృతి చెందాడు. ఇదిలా ఉంటే మరో వైపు హీరో రవితేజపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

తమ్ముడు అంత్యక్రియలకు హాజరు కాని రవితేజ, తన చిత్రం షూటింగ్ కు మాత్రం ఈ రోజు వెళ్లాడు. దీనిపై అభిమానులు, నెటిజన్లు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధతో తమ్ముడి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని చెప్పిన రవితేజ, మరుసటి రోజే షూటింగ్ ఎలా వెళ్ళారంటూ మండిపడుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘రాజా ది గ్రేట్’ షూటింగ్ లో రవితేజ పాల్గొనడంపై ఈ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Karthi’s Desperate Attempt to Turn Mass: Wrong Choice?

Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…

35 minutes ago

What A Video: CBN Bows To Godavari @ Polavaram!

Andhra Pradesh chief minister, Chandrababu Naidu has been fully committed and dedicated towards the completion…

1 hour ago