
రెండో క్యాటగిరీ స్పీడ్ నే నమ్ముకునేవాళ్లు. హిట్లు ఫ్లాపులు వస్తుంటాయి పోతుంటాయి మన పని మనం చేసుకుపోదాం అనుకునే రకం. మాస్ మహారాజా ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. కథలు సరిగా చూసుకోకుండా చేస్తాడనే కామెంట్ ఉన్నప్పటికీ నేనింతే తరహాలో దూకుడు మాత్రం తగ్గించడు. అందుకే ఒక పెద్ద హిట్టు రావడం ఆలస్యం రెండు మూడు డిజాస్టర్లు క్యూ కట్టి పలకరిస్తాయి. క్రాక్ ని సూపర్ గా ఎంజాయ్ చేశాక ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రెండూ పెద్ద షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ధమాకా వస్తోంది. మాస్ మహారాజా డ్యూయల్ రోల్ అది కూడా రౌడీ అల్లుడు ఛాయల్లో ఉంటుందని రచయిత ప్రసన్న కుమార్ లాంటోళ్ళు ఊరించడంతో అంచనాలు పెరిగాయి.
సరే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో గొప్పగా చెప్పుకోవడం, సీట్లలో కూర్చోలేరని విపరీతంగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు తదితరులు ఎలివేషన్లు ఇచ్చుకోవడం మాములే కానీ ధమాకా హిట్ కావడం రవితేజ కన్నా ఫ్యాన్స్ కే ఎక్కువ అవసరంగా తోస్తోంది. తనలో మాస్ ఎనర్జీని సరిగ్గా వాడుకుంటున్న దర్శకులు తగ్గుతున్నారు. ఏదో రాసుకుని ఏదో తీయబోయి చివరికి రొటీన్ గా తీసి శ్రీను వైట్ల లాంటి సీనియర్ డైరెక్టర్ కూడా అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి డిజాస్టర్ ఇచ్చారు. రాజా ది గ్రేట్ తర్వాత మార్కెట్ కొంత కుదుపులకు లోనైన రవితేజ అవకాశాలకు కొదవ లేదు. నిర్మాతలు వస్తూనే ఉన్నారు. సినిమాలు తీస్తూనే ఉన్నారు. అభిమానులకు ఇదొక్కటే చాలదు కదా.
పైగా వచ్చే ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య వస్తుంది. అందులో తను సోలో హీరో కాకపోయినా పాత్ర పరిధి ముప్పాతిక గంట ఉంటుందంటున్నారు కనక కరెక్ట్ గా క్లిక్ అయితే అది బ్లాక్ బస్టర్ అయితే మాత్రం సక్సెస్ లో క్రెడిట్ పంచుకోవచ్చు. ఆ తర్వాత రావణాసుర ఉంది. నెగటివ్ షేడ్స్ అంటున్నారు కాబట్టి ఏదైనా కొత్తగా ఉంటుందేమో. ఈగల్ కూడా త్వరగానే పలకరిస్తుంది. టైగర్ నాగేశ్వరరావు కొంచెం ఆలస్యమయ్యేలా ఉంది. కొంచెం అటుఇటు ఇవన్నీ 2023లోనే వచ్చేస్తాయి. ధమాకా హిట్ అయితే నేరుగా ఆ ప్రభావం వీటి మీద పాజిటివ్ గా పడుతుంది. ఎంత కౌంట్ పెరుగుతున్నా వాటిలో హిట్లు పడటం కూడా అవసరం కదా.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…