
[m9ad]
కనీసం సినిమా ఆడియో వేడుకల పైన కూడా దర్శనమివ్వని రక్షితను ప్రేక్షకులు చూసి చాలా కాలమే అయ్యింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. వీక్షించిన వారందరినీ షాక్ కు గురి చేసే విధంగా ఉన్న ఈ ఫోటోలో రక్షిత లుక్ అవాక్కు చేస్తోంది. ‘ముద్దుగుమ్మ’ కాస్త ‘బొద్దుగుమ్మ’గా మారి తన అభిమానులను కూడా అవాక్కు చేసింది.
హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిన తర్వాత వారి రూపురేఖలు మారడం సహజమే గానీ, మరీ రక్షిత అవతారం మాత్రం గుర్తించలేని విధంగా మారిపోవడం విస్మయానికి గురి చేసే విషయమే. దానికి తోడు తనకు సూట్ అవ్వని కాస్ట్యూమ్స్ ను ధరించిందని ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత కనిపించిన ఈ అమ్మడి గెటప్ వీక్షకులను కాస్త భయపెట్టే విధంగానే ఉంది మరి!
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…