
మాస్ మహారాజ రవితేజ 75వ సినిమాగా ‘మాస్ జాతర’ మొదలుపెట్టారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం, ఆయన పుట్టిన రోజు కూడా. కనుక మాస్ జాతర గ్లింమ్స్ విడుదల చేశారు.
రవితేజ ఓ మాస్ హీరో.. కనుక మాస్ జాతర చేస్తున్నాడు. కనుక ఇది కూడా ఊరమాస్‌గానే ఉంది. దీనిలో రవితేజ మార్క్ యాక్షన్ చూపారు.
ఇవాళ్ళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇది అభిమానులకు ఆయన ఇస్తున్న గిఫ్ట్ అనుకోవచ్చు. కానీ ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు, రవితేజ ఇంకా ఎంతకాలం ఈ మాస్ వేషాలతో కాలక్షేపం చేస్తారు?ఓ మంచి నటుడుగా నిరూపించుకునే పాత్రలు ఎప్పుడు చేస్తారు? అసలు చేస్తారా చేయరా?అనే సందేహం కలుగుతుంది.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన జగపతిబాబు, హీరోల పక్కన కామెడీ సీన్లకు పరిమితమై ఉండే సునీల్ వంటి నటులు, ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేస్తూ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. బాలయ్య కూడా ఇప్పుడు తన వయసుకు తగిన పాత్రలు, కధలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
కానీ 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న రవితేజ మాత్రం ఇంకా మాస్ హీరోగానే కాలక్షేపం చేస్తున్నారు. మాస్ మహరాజ్ బిరుదు ఆయనకు చాలా గర్వంగా ఉండవచ్చు. కానీ అదే ఆయనని ఆ మాస్ చట్రంలో బందించి ఉంచుతోందని గ్రహిస్తే తప్పకుండా దాని నుంచి బయటపడగలరు.
లేదంటే రవితేజ కూడా జగపతిబాబు, సునీల్‌లా అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ చేయాల్సిరావచ్చు. తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు తనని ఈవిదంగా కాక ఓ గొప్ప నటుడుగా గుర్తుపెట్టుకోవాలని రవితేజ కోరుకుంటే తప్పకుండా మంచి పాత్రలు, కధలు ఎంచుకోవచ్చు. లేకుంటే జీవితాంతం మాస్ సినిమాలు, మాస్ పాత్రలు చేస్తూ వాటితోనే అనేక ఫ్లాపులు వెనకేసుకున్న ఏకైక హీరోగా రవితేజ మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక వచ్చే పుట్టిన రోజునాటికి రవితేజ ఈ బిరుదు దాంతో వచ్చిన ఈ మాస్ భారం వదిలించుకొని చక్కటి సినిమాతో మన ముందుకు రావాలని కోరుకుందాం.
Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…
BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…