
ఇది కేవలం దర్శకుల బాధ్యత కాదు. హీరోలు కూడా అంతే స్థాయిలో సహకరించినప్పుడే ఫలితాలు బాగుంటాయి. జక్కన్నకు తోడుగా చరణ్ తారక్ లు నడిచారు కాబట్టే ఆయనంత సులువుగా దేశ విదేశాల్లో రీచ్ ని పెంచుకోగలిగారు. వాళ్లిద్దరూ మా పని అయిపోయిందని తప్పించుకోలేదు. మేజర్ కోసం అడవి శేష్ దేశమంతా తిరిగిన శ్రమ హిట్ 2కి ఏ స్థాయిలో హెల్ప్ అయ్యిందో చూశాం. కార్తికేయ 2కి నిఖిల్ ముంబై మీడియాతో మాట్లాడాడు. మాస్ మహారాజా రవితేజకు ఇది అవగతమైనట్టు ఉంది. ధమాకా పబ్లిసిటీలో భాగంగా ఎన్నడూ లేని రీతిలో ఇవాళ హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం ఫోటో షూట్ పెట్టి ఎంతో ఓపిగ్గా గంటల తరబడి నవ్వుతూ జ్ఞాపకాలు పంచాడు
ఈ మార్పు మంచిదే. ఎందుకంటే గత కొంత కాలంగా ప్రమోషన్ విషయంలో రవితేజ అంత యాక్టివ్ గా లేని మాట వాస్తవం. రామారావు ఆన్ డ్యూటీకి మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చాడు కానీ మరీ ఇలా అభిమానుల కోసం మీట్లు పెట్టిన దాఖలాలు లేవు. ఖిలాడీకి మరీ అన్యాయంగా ఇదసలు తన సినిమానే కాదన్న రీతిలో మొక్కుబడిగా ప్రమోట్ చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా నిర్మాతని ఉద్దేశించి అప్పుడప్పుడు సెట్ కి వచ్చి ఏం జరుగుతుందో చూడమని చురక వేయడం హైలైట్ అయ్యింది. అంటే సినిమా తేడా కొట్టిందనే సంకేతం ఇన్ డైరెక్ట్ గా పబ్లిక్ స్టేజి మీద ఇచ్చేశాడు. అఫ్కోర్స్ దానికి తగ్గట్టే బొమ్మ పెద్ద డిజాస్టర్ కావడం వేరే విషయం
ధమాకా విషయంలో రవితేజ స్పెషల్ ఇంటరెస్ట్ ఫ్యాన్స్ ని మరింత చేరువ చేస్తోంది. ఎందుకంటే మాస్ రాజా షూటింగు స్పాట్లకు వచ్చే అభిమానులను ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ. అదే పనిగా రమ్మని కోరుకోడు. ఏదో నా పని నాది మీ పని మీది హ్యాపీగా సినిమా చూసుకోండి అన్న తరహాలో వెళ్తుంటాడు. కానీ ఫ్యాన్స్ ఎమోషన్లు ఒక్క ఫోటోతో ఎంత బలంగా ముడిపడి ఉంటాయో అర్థమైనట్టు ఉంది. అందుకే స్వయంగా రంగంలోకి దిగాడు. కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో తనవి రెండు సినిమాలు వస్తున్నాయి. డిసెంబర్ 23 ధమాకా మూడు వారాలు తిరక్కుండానే వాల్తేర్ వీరయ్య దిగిపోతుంది. సో ఇదంతా తనకే కాదు వాటికీ హెల్ప్ అయ్యేది కాబట్టే మార్పు మంచిదే.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…