విక్రం సిరికొండ దర్శకత్వం వహించబోతున్న “టచ్ చేసి చూడు” సినిమాను నల్లమలపు బుజ్జి – వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి అటుంచితే, తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న “రాజా ది గ్రేట్” సినిమా ప్రీ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘పటాస్, సుప్రీమ్’ వంటి రెండు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కనుండడం, ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అసలు విషయం.
‘వెల్కం టు మై వరల్డ్’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఈ పోస్టర్ ప్రీ లుక్ లో టైటిల్ పక్కనే రవితేజ నిల్చుని ఉన్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గతంలో దిల్ రాజుతో రెమ్యునరేషన్ విషయంలో రవితేజకు మనస్పర్ధలు వచ్చాయన్న వార్తలు సందడి చేయగా, తాజాగా అదే దిల్ రాజు – రవితేజల కాంభినేషన్ పట్టాలెక్కుతుండడంతో, గతంలో వచ్చిన వార్తలకు ప్రాధాన్యత లేకుండా పోయింది.నా ప్రపంచంలోకి రమ్మంటున్న ‘రాజా ది గ్రేట్’
మాస్ మహారాజా రవితేజ సిల్వర్ స్క్రీన్ పైన కనపడి చాలా కాలం అయ్యింది. ప్రపంచం మొత్తం వీక్షించాలి అంటూ దేశవిదేశాలు చుడుతూ ఎంజాయ్ చేస్తున్న రవితేజ నుండి ఎట్టకేలకు రెండు సినిమాల ప్రకటన వచ్చింది. మాస్ మహారాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక రోజు ముందుగానే “టచ్ చేసి చూడు” సినిమాకు సంబంధించిన వార్తలు రాగా, తాజాగా మరొక సినిమా రవితేజ అభిమానులకు మిక్కిలి సంతోషాన్నిస్తోంది.
విక్రం సిరికొండ దర్శకత్వం వహించబోతున్న “టచ్ చేసి చూడు” సినిమాను నల్లమలపు బుజ్జి – వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి అటుంచితే, తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న “రాజా ది గ్రేట్” సినిమా ప్రీ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘పటాస్, సుప్రీమ్’ వంటి రెండు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కనుండడం, ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అసలు విషయం.
‘వెల్కం టు మై వరల్డ్’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఈ పోస్టర్ ప్రీ లుక్ లో టైటిల్ పక్కనే రవితేజ నిల్చుని ఉన్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గతంలో దిల్ రాజుతో రెమ్యునరేషన్ విషయంలో రవితేజకు మనస్పర్ధలు వచ్చాయన్న వార్తలు సందడి చేయగా, తాజాగా అదే దిల్ రాజు – రవితేజల కాంభినేషన్ పట్టాలెక్కుతుండడంతో, గతంలో వచ్చిన వార్తలకు ప్రాధాన్యత లేకుండా పోయింది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…