కేసీఆర్ కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన టిడిపి నేత!

చెత్త తరలించేందుకు రెండు రంగులలో ప్రత్యేక ఆటో ట్రాలీలను హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం నాడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తడి చెత్త ఒక రంగు డబ్బాలో, పొడి చెత్త మరో రంగు డబ్బాలో వేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి 1000 కి పైగా ఆటో ట్రాలీలు ఉన్నాయని, అతి త్వరలో నగరం మొత్తానికి సరిపోయేలా ట్రాలీలను ఏర్పాటు చేస్తానని ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు.

కేసీఆర్ ఇచ్చిన “చెత్త”పై ఉపన్యాసానికి టి-టిడిపి నేత రావుల చంద్ర శేఖర్ రెడ్డి కౌంటర్ వేసారు. తడి చెత్త, పొడి చెత్త గురించి అంతగా ప్రస్తావించిన కేసీఆర్ కు, తన పార్టీలో చేర్చుకున్న రాజకీయ చెత్త తెలియదా? దాని గురించి మాట్లాడారా? అంటూ విమర్శల దాడులు చేసారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ఇప్పటికే పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలను టి.ఆర్.యస్ పార్టీ తరలించిదని, రైతులకు పెరుగన్నం పెడతానని చెప్పిన కేసీఆర్ జైలు కూడు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలు సమీపించినపుడల్లా కేసీఆర్ ప్రజలకు “3డీ” సినిమా చూపిస్తున్నారని చలోక్తులు విసిరారు.

Share
Published by

Recent Posts

Aniesh’s Itlu Arjuna Unveils Teaser Poster

Aniesh is making his acting debut with Itlu Arjuna, which is scheduled for a theatrical…

3 minutes ago

Romanchakam Created Opportunities: Pranay Reddy Vanga

Presented by director Sandeep Reddy Vanga and directed by debutant Venugopal Reddy, Romanchakam stars Sumanth…

13 minutes ago