
Raw NTR row sparks fresh debate
జాతి రత్నాలు సినిమాలో రాహుల్ రామకృష్ణ పాపులర్ డైలాగ్ “నా వల్ల మీరు బాధపడితే నే వెళ్ళిపోతా.” ఈ డైలాగ్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత గుర్తుచేసుకోవాల్సి వస్తోంది… ‘రా ఎన్టీఆర్’ వ్యవస్థాపకుడు సాయిరూప్ తిరుపతిలో ప్రెస్‌మీట్ తర్వాత!
జూ.ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మంచిదే. కానీ ఆయనకు సంబంధం లేదనప్పుడు, అనుమతించలేదన్నప్పుడు ఆపేయాలి కదా?
కానీ ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాయిరూప్ నేడు తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టి, “ఆయన వద్దని ఒక్క మాట చెప్తే అన్నీ ఆపేస్తాం..” అని చెప్పడం రాహుల్ రామకృష్ణ డైలాగ్ గుర్తొస్తుంది.
ఎన్టీఆర్ పేరుతో మేము రాజకీయాలు చేయడం లేదు. ఆయనకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం లేదు. ఎవరి వద్ద చందాలు వసూలు చేయడం లేదు. వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా గానీ ఏమీ ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు.
కానీ తన గురించి, ‘రా ఎన్టీఆర్’ సంస్థ గురించి మీడియాలో వస్తున్న కథనాలలో వారం రోజులుగా చాలా బాధపడ్డామని చెప్పారు. అందరికీ సమాధానం చెప్పేందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పారు.
‘రా ఎన్టీఆర్’తో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, దాని కార్యకలాపాలకు తన అనుమతి లేదని ఎన్టీఆర్ స్పష్టంగా లిఖిత పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చెప్పారు.
కానీ ఎన్టీఆర్ అభిమానులమని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకుంటూనే “అయన మమ్మల్ని కలిసేందుకు ఎందుకు ఇష్టపడటం లేదు? మేమేమైనా ఉగ్రవాదులమా లేక రోగులమా? మా వలన ఆయనకు ఏం ప్రమాదం?
ఆయన నేరుగా మమ్మల్ని కలిసి మాట్లాడకుండా ఎవరి చేతో ఎందుకు ఫోన్లు చేయించి మాట్లాడిస్తున్నారు?” అంటూ నిలదీయడం విచిత్రంగా అనిపిస్తుంది.
పైగా ఆయన పేరుతో ఊరూ-వాడ కార్యక్రమం చేపట్టబోతున్నామని ప్రకటించడం ఆయనకు సవాలు విసురుతున్నట్లే అనిపిస్తుంది.
ఎన్టీఆర్ టీడీపికి దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నప్పుడు అయన పేరుతో ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రజలకు తప్పుడు సంకేతాలే వెళ్తాయి.
త్వరలో ఆయన ఊరూ-వాడతో రాజకీయాల్లోకి రాబోతున్నారని, కాదు.. ‘రా ఎన్టీఆర్’ వెనుక ఫలానా రాజకీయ పార్టీ ఉందని మీడియాలో వస్తున్న ఊహాగానాలు ఆయనకు ఇబ్బందికరంగానే ఉంటాయి కదా?ఆయనకు ఇబ్బంది కలిగించే పనులు చేయమని చెపుతూనే చేస్తూ ఎందుకు ఇబ్బంది పెట్టడం?
అంతగా సమాజసేవ చేయాలనుకుంటే ఎన్టీఆర్ పేరే పెట్టుకోవాలా?తమ సొంత పేరుతోనో లేదా గాంధీ, నెహ్రూ, బోస్, అల్లూరి సీతారామరాజు పేరుతోనో సమాజ సేవ చేస్తామంటే ఎవరైనా వద్దంటారా?
ఒకవేళ ఎన్టీఆర్ కోర్టులో కేసు వేస్తే మన పరిస్థితి ఏమిటి? అని ఆలోచించాలి కదా? అభిమానం అంతే ఇదేనా?
మేము టెర్రరిస్టులము కాదు…
NTR మమ్మలిని ఎందుకు దూరం పెడుతున్నారో అర్ధం కావటం లేదు#RAWNTR సాయి రూప్, @tarak9999 pic.twitter.com/TEE0Rl21w6
— M9 NEWS (@M9News_) July 18, 2026
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…