
కొత్త కరెన్సీ నోట్ల డిజైన్ పై ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ మీడియా ఛానెల్ సమాచార హక్కు చట్టం కింద… అసలు కొత్త నోట్ల డిజైన్ ఎప్పుడు ఆమోదించారని ప్రశ్నించింది. దీనికి సమాధానమిచ్చిన ఆర్బీఐ పాత నోట్ల రద్దుకు సరిగ్గా ఐదు నెలల ముందు అంటే జూన్ ఏడున కొత్త 2000, 500 రూపాయల డిజైన్ ను ఆమోదించినట్టు తెలిపింది.
కాగా, వాస్తవానికి గతేడాది మే 19న కొత్త నోట్ల డిజైన్ ను ఆర్బీఐ ఆమోదించినట్టు, ఆ తరువాత కొన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సదరు మీడియా ఛానెల్ వెల్లడించింది. ఇంకా ఈ కొత్త నోట్ల ముద్రణకు మాత్రం ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం చెప్పకపోవడం విశేషం. అయితే మునుపటితో పోలిస్తే ప్రస్తుతానికి పరిస్థితులు సర్దుమణగడం ఊరటనిచ్చే అంశం.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…