
ఈ కార్యక్రమంలో కియా సంస్థ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని రోజా స్పష్టం చేశారు. ఏపీఐఐసీ నుంచి కియా మోటార్స్‌కు సహకరం అందిస్తామని వెల్లడించారు. కియాలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని రోజా కోరారు.
ఇటీవలే అన్ని పరిశ్రమలలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. అయితే దీనివల్ల కంపెనీలు తరలిపోతాయని పలువురు హెచ్చరిస్తున్నారు. కార్యక్రమానికి జగన్ వెళ్లి యాలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని అడిగితే అది ఇబ్బంది కావొచ్చని, అందుకే వెళ్లకుండా మంత్రులను పంపించారని, కేబినెట్ లో లేని రోజాతో ఆ మాట అనిపించారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
Telangana politics are starting to heat up again as a social issue has come up…