Telugu

సినిమా చావుకి సవా లక్ష కారణాలు…

ఒక సినిమా సెట్స్ నుంచి థియేటర్ లోకి వచ్చేదాకా ఆ చిత్ర యూనిట్ పడే టెన్షన్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడి నుంచి మరో లెక్క అన్నట్టుగా ఒక్కసారి బొమ్మ వెండితెర మీద ప్రత్యక్షమయ్యాక ఆ చిత్ర బృందానికి మరికొన్ని టెన్షన్స్ యాడ్ అవుతాయి.

సామాన్య ప్రేక్షకుడిని ఈ సినిమా మెప్పిస్తుందా?, అభిమానులను అలరింపచేస్తుందా?, సినీ ప్రేమికుడిని థియేటర్ వరకు రప్పిస్తుందా? ఇలా ఆ చిత్ర హీరో నుంచి నిర్మాత, దర్శకుడి వరకు అనేక ఆలోచనలు వారిని వెంటాడుతాయి. ఒకవేళ అన్ని అనుకున్నవి అనుకున్నట్టే జరిగినా ఆ సినిమాని చంపేయడానికి ఎన్నో హిడెన్ ఆయుధాలు సిద్దంగానే ఉంటాయి.

ADVERTISEMENT

వాటిలో ముఖ్యమైన కొన్ని అంశాల గురించి ఇప్పుడు చర్చిద్దాం…

* పైరసి…

ఒక సినిమాను ఆర్థికంగా చంపేయడంతో, సినీ పరిశ్రమను మానసికంగా హింసించడంలో ఈ పైరసి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ ఒక కథను సినిమాగా మలచి థియేటర్లలోకి తీసుకొస్తే ఒకేఒక్క కెమెరాతో సినిమాను దొంగచాటుగా దోచేస్తున్నారు ఈ పైరసీ బూతాలు.

ఒక కొత్త చిత్రం థియేటర్లోకి వచ్చి రాగానే దాని HD ప్రింట్ ఆన్ లైన్ లో దర్శనమిస్తుంది. దానితో ఎంతోమంది ఆ దొంగ సొత్తుని ఫ్రీ గా, దర్జాగా ఇంట్లో కూర్చొనే చూసేస్తున్నారు, ఒకరకంగా సినిమాని చంపేస్తున్నారు. చిన్న సినిమా నుంచి పెద్ద ప్రాజెక్ట్ ల వరకు ఈ పైరసి భూతం టాలీవుడ్ నే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమనే వదల బొమ్మాలి వదలా అంటూ వెంటాడుతుంది.

అయితే ఈ చీకటి పైరసి నెట్ వర్క్ లో కీలక పాత్ర పోషించే ఐ బొమ్మ ని పోలీస్ అధికారులు నిలువరించినా ఐ బొమ్మ కాకపొతే మూవీ రూల్స్, అదీ కాకపోతే మరో N బొమ్మ అంటూ ఈ పైరసి చోరులు పుట్టగొడుగుల మాదిరి పుట్టుకొస్తూనే ఉంటారు, చిత్ర సీమను చంపుతూనే వస్తున్నారు.

* టిక్కెట్ రేట్ల పెంపు…

ఒకప్పుడు కొత్త సినిమా థియేటర్లోకి వచ్చిందంటే తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు, తన ఫ్యామిలీకి చూపించేందుకు సామాన్య ప్రేక్షకుడు ఆసక్తి చూపించేవాడు. కానీ ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్ల హైక్ సగటు ఫ్యామిలీ ఆడియన్స్ ని వెండితెర కి దూరం చేస్తుందనే చెప్పాలి.

పాన్ ఇండియా మార్కెట్ తో పెరుతున్న సినిమా బడ్జెట్, తద్వారా పెరిగిన స్టార్ హీరోల రెమ్యునరేషన్ సినిమా టిక్కెట్ రేట్ల హైక్ ను కోరుకుంటుంది. ఈ రేట్ల హైక్ కూడా ఒకరకంగా సినిమాని చంపేస్తుంది అనేది ఇండస్ట్రీలోనే కొందరి వాదన.

* ఓటిటి…

ఓటిటి ప్లాటుఫార్మ్స్ అంటూ వెండితెర చిత్రాలను బుల్లితెర మీదకు తెస్తున్న ఈ ప్రవైట్ సామ్రాజ్యం కూడా చిత్ర పరిశ్రమను కుదేలు చేస్తుంది. గతంలో సినిమా రిలీజ్ అయిన చాలాకాలం తరువాత టీవీ ఛానెల్స్ లో ఆ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకొచ్చేది.

కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో సినిమా థియేటర్ లో ఉన్నపుడే ఆ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కొన్ని కొన్ని చిన్న సినిమాలైతే ఏకంగా ఓటిటి రిలీజ్ లతో సరిపెట్టుకుంటున్నాయి. ఒక సబ్స్ క్రిప్షన్ ఏడాది పాటు కుటుంబం మొత్తం హాయిగా ఎటువంటి ఎక్స్ ట్రా ఖర్చు లేకుండా ఇంట్లో బెడ్ రూమ్ లో కూర్చొని సినిమాని వీక్షించే అవకాశాన్ని ప్రేక్షకుడి అందుబాటులోకి తెచ్చింది.

అలాగే వెబ్ సిరీస్ ల రూపంలో ఓటిటి లు ప్రేక్షుడికి ఎక్స్ ట్రా మసాలాను కూడా జోడిస్తున్నాయి. ఒక సినిమా వెండితెర నుంచి బుల్లితెరకు ఎప్పుడు అందుబాటులోకి రావాలి అనేది కూడా సదరు ఓటిటి సంస్థలు నిర్దారించే స్థాయికి ఓటిటి లు ఎదుగుతున్నాయి, అలాగే సినీ పరిశ్రమ ఒదుగుతుంది.

* పాలిటిక్స్…

రాష్ట్ర విభజనతో, బిఆర్ఎస్, వైసీపీ రాకతో, పవన్ పొలిటికల్ ఎంట్రీ తో సినీ పరిశ్రమ రాజకీయ రంగానికి అనుబంధ సంస్థ అన్నట్టుగా మారిపోయింది. రాజకీయ నాయకుల బలం చూపించడానికి, ప్రభుత్వాలు తలచుకుంటే సినీ సెలబ్రెటిలైనా తమతో కాళ్ళబేరానికి రావాల్సిందే అనేలా నేటి రాజకీయాలు చిత్ర పరిశ్రమను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శాసిస్తున్నాయి.

మొన్న బిఆర్ఎస్, నిన్న వైసీపీ, నేడు కాంగ్రెస్ వరకు ఈ మూడు ప్రభుత్వాలు కూడా తమ తమ అధికారంతో, తమ రాజకీయంతో చిత్ర పరిశ్రమ పై ఆంక్షలు, ఆదేశాలు జారీ చేస్తూ పరోక్షంగా చిత్ర పరిశ్రమను, ప్రత్యక్షంగా సినిమాని చంపేస్తున్నాయి.

* ఓవర్ బడ్జెట్…

ఒక మూవీ మేకింగ్ లో అతి కీలక పాత్ర పోషించే అంశాలలో బడ్జెట్ అనేది అత్యంత ప్రధానం. అయితే ఆ బడ్జెట్ యే మితిమీరితే సినిమాని ఒక రకంగా సెట్స్ లోనే సగం చంపేస్తుంది ఈ ఓవర్ బడ్జెట్. మితిమీరిన బడ్జెట్, అనవసర ఖర్చు తో సినిమా నిర్మాణ దశలోనే మోయలేని భారంగా మారుతుంది. ఆ భారమే మరిన్ని పొరపాట్లకు కారణంగా మారుతుంది. సగటు ప్రేక్షుడిని ధియేటర్ కి రప్పించడంలో బడ్జెట్ ఒక పాత్ర పోషిస్తుంది కానీ అదే కీలక పాత్ర కాదు అనేది ఇండస్ట్రీ గ్రహించాలి.

అయితే ఇన్ని అవరోధాలను, అడ్డంకులను తట్టుకుని కూడా కొన్ని మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కమర్షిల్ హిట్స్ అవుతున్నాయి, ప్రేక్షకుడి మనసు గెలుచుకుంటున్నాయి. వాటిలో కోర్ట్, లిటిల్ హార్ట్స్, సింగిల్…మంచి ఉదాహరణలుగా నిలిస్తే, ఇక భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్ చిత్రాలైన బాహుబలి, RRR , పుష్ప, కల్కి వంటి స్టార్ మూవీస్ పెద్ద పెద్ద టార్గెట్ లను సెట్ చేస్తున్నాయి.

Share
Published by

Recent Posts

IND vs WI 3rd T20I: India Win, But a Big Reality Check!

India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…

5 hours ago

Jailer 2 Bookings Explode: Rajini Mania Beats Weak Buzz?

Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…

7 hours ago