
అయితే ఇంత సాధించిన రాజమౌళిని చూస్తుంటే… కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది? అందరి విషయం ఏమో గానీ, తనయుడు ఎస్.ఎస్.కార్తీకేయ మాత్రం ఓ ఫోటో ద్వారా తన మనోభావాలను ఏమిటో నెటిజన్లకు చాటిచెప్పాడు. ప్రస్తుతం తన తండ్రిపై వస్తున్న ప్రశంసలకు నిదర్శనంగా… ప్రపంచానికి రీల్ బాహుబలి ప్రభాస్ అయితే, రియల్ బాహుబలి రాజమౌళి అని, ఇది తనకు ఎంతో గర్వంగా ఉందంటూ తన భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అయితే ఈ ఫోటో చూసిన వారు దీనిని ఏకీభవించకుండా ఉండలేరు. ఎందుకంటే… అయిదేళ్ళ పాటు తన శ్వాస, ఆశ అన్నీ ‘బాహుబలి’ అని శ్రమించిన వ్యక్తులలో అగ్ర తాంబూలం రాజమౌళికే దక్కుతుంది మరి. కళ్ళెదురే కనపడుతున్నా, ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ‘బాహుబలి’ షాట్స్ చుట్టూ తిరిగేవని రమా రాజమౌళి చెప్తుంటే… అందులో హాస్యం కనపడుతున్నా, సినిమాపై జక్కన్నకున్న పాషన్ ఏ పాటిదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే ఈ ఫోటో ఈ రేంజ్ లో హల్చల్ చేస్తోంది.
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…
The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…