
గుంటూరులో నీరూస్ షోరూంను ప్రారంభించడానికి ‘టాలీవుడ్ లిప్ లాక్ సుందరి’ రెజీనా విచ్చేసింది. ఎప్పుడో ఇలా ప్రారంభోత్సవాలకు తప్ప తమ కంటికి కనపడని హీరోయిన్ రెజీనాను వీక్షించడానికి స్థానికంగా చాలామంది జనం విచ్చేసారు. అయితే అందులో ఓ యువకుడు చూపిన అత్యుత్సాహం అతడిని సజీవ దహనం చేసింది. దీంతో అందరి కళ్ళ ముందే విజయ్ అనే ఆ యువకుడు అగ్నికి ఆహుతి అయిపోవడంతో, పరిసర ప్రాంతాల్లో విషాదం అలుముకుంది.
అందరితో పాటు సదరు షోరూం వద్దకు వచ్చిన విజయ్, సరిగా నిలబడడం కోసం ఓ ఫ్లెక్సీని ముట్టుకున్నాడు. అయితే ఆ ఫ్లెక్సీ ట్రాన్స్ ఫార్మర్ ను తాకి ఉండడంతో, ఫ్లెక్సీని పట్టుకున్న వెంటనే మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న స్థానికులు మంటల నుండి రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, అవి సఫలం కాలేకపోయాయి. దీంతో అక్కడికక్కడే విజయ్ కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో మరో యువకుడు గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
అయితే అంత నిర్లక్ష్యంగా ఫ్లెక్సీని ట్రాన్స్ ఫార్మర్ కు ఆనిస్తూ ఎవరు కట్టారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. షోరూం ఓపెనింగ్ లో భాగంగా నీరూస్ వారే ఏర్పాటు చేసారా? లేక ఎవరైనా అభిమానులు సమాచారం అందుకుని ఏర్పాటు చేసారా? అనేది తెలియాల్సి ఉంది. సహజంగా ఇలాంటి ఓపెనింగ్స్ లో షోరూంకు చెందిన వారే గౌరవార్ధంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు. బహుశా పోలీసు విచారణలో ఈ నిజాలు ఏమైనా బయటకు వస్తాయేమో చూడాలి. ఏది ఏమైనా హీరోయిన్ల క్రేజ్ తో ఓ భావితరం యువకుడు మాత్రం బలైపోయాడు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…