Telugu

బోరుమంటున్న ఒక్కో హీరోయిన్… అందరిదీ ఒకటే సినిమా..!

సినీ పరిశ్రమలో హీరోయిన్లు రాణించడమంటే ‘కత్తి మీద సామే’ అని చాలా మంది చెప్తుంటారు. గ్లామర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే… కొన్ని నైతిక విలువలకు తిలోధకాలు ఇచ్చేయాల్సిందేనని ఓ టాక్. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా… ఇండియన్ సినీ పరిశ్రమను కుదిపేసిన భావన ఉదంతం తర్వాత ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెదవి విప్పుతున్నారు. తనపై జరిగిన అఘాయిత్యానికి భావన ఏకంగా కేసు పెట్టగా, ఆ తర్వాత ప్రముఖ హీరో శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి కూడా ఓ మీడియా వ్యక్తి తనపై ప్రవర్తించిన విధానాన్ని బయటపెట్టింది.

ADVERTISEMENT

ఇదే బాటలో ప్రముఖ హీరోయిన్ రెజీనా కూడా పెదవి విప్పింది. కెరీర్ తొలినాళ్ళల్లో దాదాపుగా ఏడు సంవత్సరాల క్రితం ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నపుడు, ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి తమిళంలో ఓ సినిమాకు అవకాశం ఇస్తాను, కానీ ఈ ఛాన్స్ కావాలంటే కొన్ని “అడ్జెస్ట్ మెంట్స్” చేయాలని కోరాడని, అతని మాటల్లోని ఆంతర్యాన్ని చెప్పుకొచ్చింది రెజీనా. అయితే ఆ వ్యక్తి మాటలు విన్న మరుక్షణమే, తానూ ఫోన్ కట్ చేసేసానని, ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఎదురవుతూనే ఉంటాయని తెలిపింది.

విపత్కర పరిస్థితులు ఎదురైన వేళ, మహిళలు తమను తాము రక్షించుకునే మెళకువలు తెలిసి ఉండాలని చెప్పింది రెజీనా. చూడబోతుంటే… ప్రతి హీరోయిన్ బయోపిక్ లో ఇలాంటి “కధలకు” కొదవలేదేమో అనే విధంగా ఒక్కొక్కరు తమ తమ అనుభవాలను చెప్పుకొస్తున్నారు. కొందరు ఓపెన్ గా చెప్తుండగా, మరికొందరు పరువు, మర్యాదల కారణంగా బయట పెట్టలేకపోతున్నారన్న విషయం అర్ధమవుతోంది. భావన, వరలక్ష్మి, రెజీనాలు మొదలుకుని, ఇంకెన్ని సెలబ్రిటీ కధల వ్యధలు బయటకు వస్తాయో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

India’s Unfair T20I Snub? Selection Call Questioned

Rinku Singh has once again missed out on India’s T20I squad, and former India batter…

22 minutes ago

Monster: Salman Khan’s K.G.F Vibes Trigger Flop Fears?

Salman Khan has been struggling to deliver a good film over the last few years.…

41 minutes ago