
ఈ ఫోన్లను అపరిమిత వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లు, డిజిటల్ కంటెంట్ తో సహా బండిల్డ్ ఆఫర్ కింద విక్రయిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు ఎకనామిక్ టైమ్స్ పత్రికకు తెలిపారు. ఇదే సమయంలో గూగుల్ సంస్థ సైతం రిలయన్స్ జియో కోసం ఓ చౌక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఆధారిత ప్లాట్ ఫాంపై పనిచేసే ఈ ఫోన్ కూడా జియో నెట్ వర్క్ పై బండిల్డ్ ఆఫర్ తో రానుంది. ఈ మేరకు ఇరు కంపెనీలు కలసి పని చేస్తున్నాయని, ఈ సంవత్సరమే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని సమాచారం.
Allari Naresh is officially back in top form with Ramba Oorvasi Menaka, reminding everyone of…
The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…