Telugu

మరో సంచలనానికి సిద్ధమవుతోన్న జియో!

టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిల‌య‌న్స్ జియో ఇక డీటీహెచ్ సర్వీసు స్పేస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. 360 పైగా ఛానల్స్ ను జియో టీవీ ఆఫర్ చేయనుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వాటిలో 50 హెచ్‌డీ ఛానల్స్ కూడా ఉండడం మరింత స్పెషల్ గా మారింది. జియో డీటీహెచ్ లకు సంబంధించిన సెటప్ బాక్స్ ఇమేజ్ లు ప్రస్తుతం వెబ్ ప్రపంచంలో సందడి చేస్తున్నాయి. వాటిపై జియో ముద్ర‌లు కూడా ఉండడంతో త్వరలోనే ప్రజల వద్దకు చేరుతున్నాయన్న సమాచారం అందుతోంది.

దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ సెటప్ బాక్స్ ల ఫ్రంట్ లో యూఎస్‌బీ పోర్టు, స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్, హెచ్డీఎంఐ, వీడియో, ఆడియో అవుట్ పుట్ ఉన్నాయి. ప్ర‌స్తుతం ఉన్న సెటప్ బాక్స్‌ ల కంటే ఈ జియో సేవ‌లు ఎంతో అత్యాధునిక‌మైన‌విగా, కేవలం వాయిస్ తోనే ఛానల్స్ ను సెర్చ్ చేసుకోవ‌చ్చ‌ట‌. హీరో, హీరోయిన్ పేరు చెబితే చాలు, వారి సినిమాలు ఏ ఛానల్ లో వస్తాయో తెలిసిపోతుంద‌ట‌. డీటీహెచ్ విభాగంలోనూ త‌క్కువ‌ రేట్ల‌కే సేవ‌లు అందిస్తూ జియో మ‌రో సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ స‌ర్వీసుల‌ను మొద‌ట‌ ముంబయిలో ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది‌. అలాగే ఈ ఏడాది నాటికి దేశమంతా విస్తరించే విధంగా సంచలన నిర్ణయం త్వరలోనే అధికారికంగా వెలువరించవచ్చని టాక్. ఇక ధర విషయానికి వస్తే… టెలికాం రంగంలో జియో సిమ్ ల మాదిరే, ఈ సెటప్ బాక్స్ కేవలం 450 రూపాయలకు విక్రయించనుండగా, తొలి ఆరు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా మార్కెట్ లో ఉన్న ధరల కంటే 50 శాతం తక్కువకే జియో ఛార్జ్ చేసే విధంగా సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kamal Haasan, RKFI, SU Arun Promise a Huge Action Feast

Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…

1 minute ago

Why Kayadu Lohar Called Herself a “Potato”

Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…

33 minutes ago