
అలా సొంత బ్యానర్లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి పారితోషికం విషయంలో ఇటీవల ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న మహేష్, పవన్ రేంజ్ లోనే చిరంజీవి కూడా ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు పారితోషికాన్ని పుచ్చుకోబోతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. వినడానికి అభిమానులకు వినసొంపుగా ఉన్న ఈ ఫిగర్… వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే… అసలు ఈ సినిమాకు చిరంజీవి ‘రెమ్యూనరేషన్’ తీసుకోవడం అనేది హాస్యాస్పదంగా మారింది.
150వ ప్రతిష్టాత్మక సినిమా కావడంతో సొంతంగా నిర్మించుకుంటున్న ఈ సినిమాకు చిరుకు ‘ప్రతిఫలం’గా దక్కేది ‘రెమ్యూనరేషన్’ అంటే కూడా ‘లాభం’ అంటే సరిగా సరిపోతుందేమో! ఆ లాభం 30 కోట్లే అవుతుందో లేక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా ఎక్కువ అవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.
For the first time in a long time, there is genuine curiosity about whether Prabhas…
Goodachari 2 is one of those Telugu films that has built strong expectations without relying…