Telugu

వాళ్ళకెందుకు అంత సీన్ ఇవ్వడం!

పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి నుండి విడిపోయి ఒంటరిగా నివసిస్తూ ధైర్యంగా జీవనం సాగిస్తోన్న రేణుదేశాయ్ ఓ విషయంలో మాత్రం తీవ్ర మనోవేదనతో ఉన్నట్లుగా కనపడుతున్నారు. ఆదివారం నాడు ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో … పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించిన రేణుదేశాయ్, ప్రస్తుతం సమాజం ఎటు పోతుంది? నేటి యువతరం ఎలా ఆలోచిస్తున్నారు? అన్న దానిపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

తన ఆలోచనలను సోషల్ మీడియాలో పెడుతున్న వేళ, వారి నుండి వస్తున్న రియాక్షన్స్ పట్ల అవాక్కవుతున్నారు. చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అభ్యంతరకరంగా మెస్సేజ్ లు పెడుతుంటే… మనదేశం ఎక్కడికి పోతుంది? అన్న ఆలోచనలు వస్తున్నాయని, ఓ పక్కన మోడీ ఏమో ‘బేటీ బచావ్… బేటీ పడావ్…’ అంటూ స్లొగన్స్ ఇస్తుంటే, మరో పక్కన మన సమాజంలో ఉన్న వ్యక్తులు కనీస ఆలోచనలు లేకుండా ప్రవర్తించడం విస్మయానికి గురి చేస్తోందని ఆవేదన చెందారు రేణు.

ADVERTISEMENT

ఒకప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి కామెంట్ చదువుకునే తాను, ఒక ఏడాదిగా మాత్రం ఒక టీంను అప్పాయింట్ చేసుకున్నానని, ప్రస్తుతం వారే తన సోషల్ మీడియా పనంతా చూస్తున్నారని తెలిపింది. అలాగే జీవితంలో తనకు మరో తోడు కావాలనుకుంటున్నానని, అది జరిగిన నాడు పెళ్లి దండలతో ఒక ఫుల్ ఫోటోను ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు.

జీవితంలో ఎంతో పరిపక్వతతో ఆలోచించే రేణుదేశాయ్, సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే కామెంట్స్ విషయంలో మాత్రం అంత పరిపక్వతను కనపరచడం లేనట్లుగా కనపడుతోంది. ఆమె వ్యాఖ్యలను పరిశీలిస్తే… నెటిజన్లు చేసే కామెంట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనపడుతోంది. నిజానికి వారికంత సీన్ అవసరమా? ఆ వ్యాఖ్యలకు అంత విలువ ఇవ్వడం అవసరమా? అంటే రేణుదేశాయ్ కాస్త ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్న విషయం అర్ధమవుతోంది.

తనపై అభ్యంతరకంగా కామెంట్స్ చేసిన పవన్ ఫ్యాన్స్ కు గానీ, ఇతరులకు గానీ బుద్ధి చెప్పడానికైనా ఖచ్చితంగా మరో వివాహం చేసుకుని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం పొందే యోచనలో రేణుదేశాయ్ ఉన్నట్లుంది. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ అని పిలవడం కన్నా, అకిరా, ఆద్యల తండ్రి పవన్ కళ్యాణ్ అని పిలవడం ఉత్తమమేమో అంటూ ఓ సెటైరికల్ డైలాగ్ కూడా ఈ ఇంటర్వ్యూలో సదరు మీడియా ప్రతినిధిపై వేసారులేండి!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ram Charan Must Try Ravi Teja Route Soon?

Telugu cinema has delivered a major commercial success with Irumudi, starring Ravi Teja in the…

11 minutes ago

Hitman’s Cryptic Move: Agarkar Dig or Just Coincidence?

Rohit Sharma has once again caught the attention of Indian cricket fans, but this time…

41 minutes ago