
కానీ రజనీకాంత్ “కాలా” సినిమా వాయిదా పడడంతో, ఖాళీ అయిన స్థానంలోకి “ఆచారి అమెరికా యాత్ర” వచ్చింది. మంచు విష్ణుకు జతగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మానందం రోల్ చాలా కీలకంగా ఉండబోతోందని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేసారు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు కొనసాగింపు తరహాలో ఉండబోతున్న ఈ సినిమాలో ఫుల్ వీడియో సాంగ్ అప్పుడే రిలీజ్ చేసేసారు.
సాధారణంగా బొమ్మ ధియేటర్లలో పడిన తర్వాత వీడియో సాంగ్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా రిలీజ్ కు మూడు రోజుల ముందే వీడియో సాంగ్ ను వదిలేసారు. దీని వలన పెద్దగా చేకూరే ప్రయోజనం లేదు గానీ, గతంలో ‘ఛలో’ సినిమాకు కూడా ఇదే తరహాలో రిలీజ్ కు ముందే ఓ వీడియో సాంగ్ యూ ట్యూబ్ లోకి వదిలేసారు.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…