
దీంతో శుక్రవారం నాడు తెలంగాణలో టీడీపీ పాలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల నుంచి ఫిరాయింపులు అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, ఈ వారం ప్రారంభంలో రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు న్యూఢిల్లీలో ఉండి, కాంగ్రెస్ లో చేరికపై మంతనాలు సాగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాను పార్టీ మారనున్నట్టు వచ్చిన వార్తలను రేవంత్ ఖండించినప్పటికీ, ఏపీ టీడీపీ నేతలను ప్రత్యక్షంగా విమర్శించడం, కేసీఆర్ నుంచి యనమల రామకృష్ణుడు వంటి మంత్రులు కోట్ల విలువైన కాంట్రాక్టులను పొందారని సంచలన ఆరోపణలు చేయడం ద్వారా, మానసికంగా తాను కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సంకేతాలను వెలిబుచ్చారు. ఇక అనధికార వర్గాలు ఊహిస్తున్నట్టుగా రేవంత్ తో పాటు 16 జిల్లాల్లోని పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తే, తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయినట్టే!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…