
వచ్చే నెల 9న రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో రేవంత్ ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రేవంత్ కలిసినట్లు వార్తలు రావడంతో తెదేపాలో వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన తెదేపా.. రేవంత్‌రెడ్డిని పార్టీ పదవుల నుంచి తొలగించింది.
అయితే, అన్ని విషయాలూ చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయనకు వివరిస్తానని రేవంత్‌రెడ్డి చెబుతూ వచ్చారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని, అయితే టీడీపీతో పాటు అద్యక్షుడిపైనా తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు.
రాజీనామా లేఖలో తెలంగాణా తెదేపా నాయకులపై విమర్శలు గుప్పించారని సమాచారం. విజయవాడ వచ్చిన రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడాలని కోరినట్టు సమాచారం. ఒక ప్రెస్ మీట్ ఉందని అయ్యాక మాట్లాడమని రేవంత్ రెడ్డికి చేపినట్టు సమాచారం. ఐతే రేవంత్ వేచి చూడకుండా రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ తనకు అందలేదని, ఏం చెయ్యాలో పార్టీలో మాట్లాడి నిర్ణయిస్తాం అని చంద్రబాబు మీడియాతో చెప్పారు.
Ram Charan and Sukumar’s second collaboration, tentatively titled RC 17, is already creating curiosity with…
The Tamil thriller series Vilangu was originally released on Zee5 on February 18, 2022. It…