
[m9ad]
తాను జైల్లో ఉన్నా.. ఎక్కడున్నా కొడంగల్ నుంచే పోటీ చేస్తానని, తనను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోస్గి ప్రజలను కోరారు. కొడంగల్ ప్రజలపై నమ్మకంతోనే తాను హైదరాబాద్ వెళ్తున్నానని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే తన చివరి ఉపన్యాసం కావొచ్చేమోనన్న సందేహం వ్యక్తం చేశారు.
ఈరోజు ఉదయం నుండి రేవంత్ రెడ్డి ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతున్నవి. ఈ క్రమంలో ఆయన ఈరకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గద్దెదించటమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. మోదీ, కేసీఆర్ కలిసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ఎన్ని కుట్రలు జరిపినా తన గెలుపును ఆపలేరని ఆయన అన్నారు.
A new immigration bill introduced on Wednesday by Eli Crane is stirring debate around the…
In the 32nd match of the IPl 2026, Rajasthan Royals defeated Lucknow Super Giants by…