
‘బ్రహ్మోత్సవం’ అంటూ ట్యాగ్ వేస్తూ రేవతితో సితార ఉన్న ఫోటోను ప్రిన్స్ విడుదల చేయడంతో ఈ చలాకీ చిన్నారి వెండితెరపై ఏ విధంగా చెలరేగుతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మహేష్ తనయుడు గౌతమ్ కంటే సితార చాలా అల్లరి పిల్ల అంటూ గతంలో మహేష్, నమ్రతలు వివిధ సందర్భాలలో చెప్పారు. అలాగే సినీ మా అవార్డ్స్ కార్యక్రమంలో కూడా స్టేజ్ పైన సితార చేసిన సందడికి వీక్షకులంతా ముగ్ధులయ్యారు.
సుకుమార్ “1 నేనొక్కడినే” సినిమాతో గౌతమ్ ను వెండితెరకు పరిచయం చేసిన ప్రిన్స్, శ్రీకాంత్ అడ్డాల “బ్రహ్మోత్సవం” సినిమాలో సితారను గ్రాండ్ ఎంట్రీ ఇప్పించారు. ఈ రెండు సినిమాలను గమనిస్తే… ఈ ఇద్దరూ దర్శకులు కూడా ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. అయితే గౌతమ్ నటించిన సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది గానీ, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. మరి సితార నటించే సినిమా ఏమవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Pics: Nandamuri Mokshagna’s Debut Announced
The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…