
తన లైఫ్ స్టైల్ తాను ఆలోచించే విధానాన్ని దాచుకోకుండా, దాక్కోకుండా తాను రాసిన పుస్తకం ‘నా ఇష్టం’లో మెత్తం విప్పి రాశానని, వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడారని కొన్ని రోజుల క్రితమే యండమూరి వీరేంద్రనాథ్ ని తిట్టారని, మరి వాళ్లు వేరే వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసం అంటే? అంటూ పవన్ ను ప్రశ్నించారు. తాను పవన్ మీద ఇష్టంతో నిజాయితీగా మాట్లాడానని, ఆయనను విమర్శలు చేయడానికి కాదని పవన్ తెలుసుకోలేకపోవటం తన దురదృష్టమని అన్నారు.
చివరగా… పవన్ కళ్యాణ్ కు, అతని భార్యకు, పిల్లలకు, కుటుంబానికి, జనసేన పార్టీకి, పవన్ అభిమానులకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు… గుడ్ బై చెప్పారు. తాజా పరిణామాలతో పవన్ పై భవిష్యత్తులో స్పందించరేమో సంకేతాలను వర్మ ఇచ్చారు. గతంలో ఓ సారి కూడా ఇలాగే పవన్ పై ఇక ట్వీట్లు చేయను అని చెప్పి, మరికొద్ది రోజులకే మళ్ళీ మొదలుపెట్టిన వైనం తెలిసిందే. బహుశా పవన్ నుండి బయటపడేందుకో ఏమో గానీ, వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను తగులుకున్నారు వర్మ.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…