Telugu

నా మైండ్ దొబ్బిందన్న వర్మ… నాకు లేదన్న నాగ్..!

తన సినిమాలకు గానీ, తనకు గానీ ఫ్రీ పబ్లిసిటీ ఏ విధంగా రాంగోపాల్ వర్మ ఇప్పించుకోగలరో తెలిసిందే. రొటీన్ డైలాగ్ లకు భిన్నంగా వ్యాఖ్యానించి మీడియాను ఆకర్షించే వర్మ, తాజాగా నాగ్ తో తీయబోతున్న చిత్రం ప్రారంభోత్సవంలో మరోసారి అలాంటి వ్యాఖ్యలనే చేసారు. వరుసగా తాను చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో వస్తున్న విమర్శలపై వర్మ ఈ సందర్భంగా స్పందించారు.

“గత కొంతకాలంగా వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపొయింది అన్న విమర్శలు వస్తున్నాయి. మైండ్ దొబ్బిందన్న మాట నిజం, అయితే జ్యూస్ అయిపోయిందో? లేదో? అన్న విషయం మాత్రం ఈ సినిమా తర్వాత అందరికీ తెలుస్తుంది” అంటూ ఈ సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కధ విని నాగ్ ఇచ్చిన రియాక్షన్ తో ఈ కధపై తనకు ఎంతో నమ్మకం పెరిగిందని అన్నారు.

ADVERTISEMENT

దీనికి ప్రతిగా నాగార్జున మాత్రం “నాకు మైండ్ దొబ్బలేదు… నా మైండ్ బాగానే ఉంది…” అంటూ వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా నవ్వేసారు. డబుల్ మెచ్యూరిటీ, డబుల్ పరిపూర్ణతతో ఈ చిత్రం చేస్తున్నానని, వర్మపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ‘శివ’ సినిమా కన్నా గొప్ప హిట్ అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నామని అన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

సాగునీటి రంగంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా….

ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు... వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు,…

25 minutes ago

KTR Pranked Prabhas, But Darling’s Reaction Steals It

BRS working president KTR’s prank call to Prabhas is winning laughs online. The politician pulled…

31 minutes ago