
అయితే తమ చిత్రంలోని ‘దగా..దగా.. కుట్ర’ పాటను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్‌టీఆర్‌ను దించేయడానికి ముందే శ్రీశ్రీ రాశారని వివరించారు. ఈ పాటలో చూపినవన్నీ కూడా ప్రజాబాహుళ్యంలో ఉన్నవేనని, చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడని ఎన్‌టీఆరే స్వయంగా చెప్పారని తెలిపారు. లక్ష్మీపార్వతి, ఎన్‌టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఈ వ్యవహారంలో పుస్తకాలు కూడా రాశారని చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి వివరించారు. అదే సమయంలో చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు పిటీషన్ లో.
సినిమా వల్ల తమకు వ్యక్తిగతంగా హాని జరుగుతుందని భావించిన వ్యక్తే కోర్టుకు రావాలి తప్ప, అతని తరఫున మరొకరు వచ్చేందుకు వీల్లేదని పేర్కొన్నారు. ఈ పాట వల్ల నష్టం కలుగుతుందనుకుంటే వారు సివిల్ సూట్ లేదా పరువు నష్టం కేసు దాఖలు చేసుకోవచ్చునని వాదించారు. అంటే చంద్రబాబు ఎలాగూ అటువంటి స్టెప్ తీసుకోరు గనుక దానిని అలుసుగా తీసుకుందని చూస్తునట్టున్నారు రామ్ గోపాల్ వర్మ మరియు చిత్ర నిర్మాత. ఇప్పుడు ఈ విషయంపై కోర్టు ఏం నిర్ణయిస్తుందో చూడాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ మర్చిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…
Since the official announcement of Allu Arjun and Lokesh Kanagaraj's tentatively titled AA23, fans have…