
ఇక ఈ కేసులో ముంబైకి చెందిన మోనిశ్ కపాడియా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనార్దన్ అలియాస్ జానీలు కీలకమని డీసీపీ రాధాకిషన్ రావు వెల్లడించారు. డి వెంకట్ రావు అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకున్న జనార్దన్, 40 నుంచి 50 వరకూ వాట్స్ యాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా విటులను ఆకర్షిస్తున్నాడని తెలిపారు. సినిమా, టీవీ నటులను ఈ ఉచ్చులోకి దింపి, ఆపై వారి చిత్రాలను వాట్స్ యాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాడని, ఎవరైనా బుక్ చేసుకుంటే, విమానాల్లో వారిని రప్పిస్తాడని అన్నారు.
హోటల్స్ లో రూములు సిద్ధం చేసి, హీరోయిన్స్ ను లోపలికి పంపి, లాబీల్లోనే డబ్బుల లావాదేవీలు పూర్తి చేసుకుంటారని తెలిపారు. ఆపై రూమ్ యాక్సెస్ కార్డులను విటులకు ఇచ్చి, గది నంబర్ చెప్పి పంపుతాడని అన్నారు. ప్రస్తుతం జనార్దన్ తప్పించుకున్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.…
Most people think twice before eating street food because it is exposed to dust, traffic…