
AP Municipal Polling Complaints
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.
వైసీపీ కంచుకోటగా భావించే ఒక్క కడప జిల్లాలో, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో మాత్రం అల్లర్లు జరుగుతున్నాయి.
పోలింగ్ రోజున జిల్లాలో అల్లర్లు జరుగుతాయని ముందే ఊహించిన ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించింది. దీంతో అల్లరిమూకల ఆటలు సాగడం లేదు. అయినప్పటికీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో అల్లరి మూకలు చెలరేగిపోతూ ప్రత్యర్ధులపై రాళ్ళ దాడులు చేస్తున్నాయి.
కనుక వైసీపీ, దాని సోషల్ మీడియాలో వాటిని హైలైట్ చేసి చూపిస్తూ రాష్ట్రమంతటా ఇలాంటి అరాచక పరిస్థితులే నెలకొన్నాయని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
కానీ వివిధ జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లను, ఉదయం 9 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాలను గమనిస్తే పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోందని స్పష్టమవుతోంది.
కడప జిల్లాలో ఉదయం 9 గంటలకు 8.3 శాతం నమోదైంది. కడప కార్పోరేషన్లో శాతం నమోదు కాగా, జమ్మలమడుగులో అత్యల్పంగా 6.8 శాతం అత్యధికంగా ఎర్రగుంట్లలో 12.5 శాతం నమోదైంది. పులివెందులలో 11.1 శాతం నమోదైంది.
వైసీపీ వివాదాస్పదంగా పేర్కొంటున్న తిరుపతి జిల్లాలో 11.06 శాతం నమోదవడంతో అటువంటిదేమీ లేదని స్పష్టం అయ్యింది.
చీరాలలో 12 శాతం, తెనాలిలో 9 శాతం, వినుకొండలో 9 శాతం, విశాఖలో అత్యల్పంగా 3.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఈసారి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీవీ రావు ఆకస్మికంగా విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగడంతో ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. కానీ విజయవాడలో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోంది.
జనసేన అభ్యర్ధిగా మేయర్ పదవికి పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ తన సతీమణితో వచ్చి ఎటువంటి హడావుడి లేకుండా ఓటు వేసి వెళ్ళారు.
బాలకృష్ణ దంపతులు హిందూపురంలో చౌదీశ్వర కాలనీలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తంగా చూసినట్లయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా సాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అప్పటికి క్యూలైన్లో ఉన్నవారందరినీ ఓట్లు వేసేందుకు అనుమతిస్తారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…
Ram Charan and Sukumar’s new film #RC17 was officially launched with a pooja ceremony attended…