Telugu

ధోనికి సాధ్యం కాని రికార్డు పంత్ పేరిట!

టీమిండియా రధసారధిగానే కాకుండా బ్యాట్స్ మెన్ గా కూడా మహేంద్ర సింగ్ ధోని అనేక రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. కానీ ఆ మహెంద్రుడికి కూడా సాధ్యం కాని ఓ రికార్డును తాజా సంచలనం రిషబ్ పంత్ తన రెండవ టెస్ట్ మ్యాచ్ లోనే సాధించాడు. అవును… ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ అద్వితీయమైన పోరాటపటిమను ప్రదర్శించి, అమోఘమైన సెంచరీని నమోదు చేసిన విషయం తెలిసిందే.

[m9ad]

ADVERTISEMENT

ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ, పంత్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది, విమర్శకులను మెప్పించింది. అయితే ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును కూడా తన వశం చేసుకున్నాడు రిషబ్. నాలుగవ ఇన్నింగ్స్ లో ఓ ఇండియన్ వికెట్ కీపర్ గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను పంత్ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు వరకు మహేంద్ర సింగ్ ధోని సాధించిన 76 పరుగులే అత్యధికం.

నాలుగవ ఇన్నింగ్స్ లో కనీసం సెంచరీ దరిదాపుల్లోకి కూడా రాలేని ఇండియన్ వికెట్ కీపర్ జాబితాను రిషబ్ తన బ్యాటింగ్ ప్రతిభతో సవరించాడు. విశేషం ఏమిటంటే… అంతకుముందు ధోని పేరిట ఉన్న 76 పరుగులు కూడా ఇంగ్లాండ్ లోనే నమోదు కావడం. ఓటమి పాలు కావాల్సిన ఆ మ్యాచ్ లో ధోని అజేయమైన ఇన్నింగ్స్ మ్యాచ్ ను డ్రాగా ముగించడంలో తోడ్పడింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

జనసేన బలపడేందుకు మరో పాతికేళ్ళు .. సైనిక్స్ అంత ఓపిక ఉందా?

ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ చెప్పిన…

16 minutes ago

Varanasi: Huge Hype, But Are the Deals Big Enough?

SS Rajamouli’s Varanasi is still months away from its April 7, 2027 release, but discussions…

28 minutes ago