
ఈ మేరకు జరుగుతున్న కార్యక్రమాల హైలైట్స్ ను టీజర్ రూపంలో విడుదల చేయడంతో ఈ ఆడియో వేడుకపై మరింత ఆసక్తి పెరుగుతోంది. బుర్జ్ దుబాయ్ పార్కు హోటల్ లో ఒక సినిమా ఆడియో వేడుక జరిపేందుకు దుబాయ్ ప్రభుత్వం అనుమతివ్వడం 2.0తోనే ప్రారంభం కానుంది. ఈ ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 125 సింఫొనీ కళాకారులతో కలిసి సంగీత విభావరి నిర్వహించనున్నాడు. ఈ సందర్భంగా ‘2.0’ సినిమాలోని ఒక పాటకి రెహ్మాన్ లైవ్ కంపోజింగ్ చేయడం. శివాజీ, రోబో, 2.0 సినిమాల్లోని పాటలకు బాస్కో డ్యాన్స్ బృందం ప్రదర్శన చేయనుంది.
ఈ ఆడియో వేడుకను 12,000 మంది ఉచితంగా వీక్షించే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్ లోని పెద్ద పెద్ద మాల్స్ లో ఈ ఆడియో వేడుక ప్రత్యక్ష ప్రసారానికి భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇందుకు మొత్తమ్మీద 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కోలీవుడ్ టాక్. ఈ ఆడియో వేడుకలో పాల్గొనాల్సిందిగా విశ్వనాయకుడు కమల్ హాసన్ ను శంకర్ స్వయంగా కలిసి ఆహ్వానమందించారు. అలాగే దీనికి ముఖ్యఅతిథిగా దుబాయ్ రాజు హాజరయ్యే అవకాశం ఉండడం విశేషం.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…