
‘ప్రజారాజ్యం’ సందర్భంగా చిరును ఏకిపారేసిన వ్యక్తులలో ప్రధమ వ్యక్తి రోజానే. అలాంటి రోజా చిరును ఇంటర్వ్యూ చేయడంతో అంతా ఆసక్తిగా మారిపోయింది. పరిపక్వత మెండుగా ఉన్న చిరు, రోజాను కేవలం ఒక హీరోయిన్ గా భావించి సమాధానాలు చెప్పారు తప్ప, తనను తిట్టిన రాజకీయ నాయకురాలిగా స్పందించలేదు. అలాగే రోజా కూడా తన అభిమాన హీరో కళ్ళ ముందు కనపడితే, ఎలా స్పందిస్తారో, అలాగే చిరును కుశల ప్రశ్నలు అడుగుతూ కార్యక్రమాన్ని రక్తికట్టించింది.
ఇందులో భాగంగా ‘ఖైదీ నంబర్ 150’ చిత్ర పాటలు బాగున్నాయని, అన్ని పాటలకు మా ‘జబర్దస్త్’ కార్యక్రమంలో ఇప్పటికే నేను డ్యాన్స్ లు చేసేసానని, ‘అమ్మడు కుమ్ముడు’ పాట ఎప్పుడూ ప్లే అవుతుంటుందని, అలాగే ‘రత్తాలు’ పాటకు కూడా ఇటీవలే డ్యాన్స్ చేసానని రోజా చెప్పగా… అవునా… అంటూ ఆశ్చర్యపడిన మెగాస్టార్ గారు, అప్పుడప్పుడు నేను కూడా ‘జబర్దస్త్’ చూస్తుంటాను అని సమాధానం ఇచ్చారు. మెగాస్టార్ రేంజ్ వ్యక్తి ‘జబర్దస్త్’ చూడడమేంటి అనుకుంటే పొరపాటే… వినోదం ఎవరికి చేదు..! అది డబుల్ మీనింగ్ అయినా… సింగిల్ మీనింగ్ అయినా..!
Vishwak Sen’s Cult has opened to a very poor response at the box office. The…
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…