
ఆ కాలంలో వారు ఎక్కడ ఉన్నారు ఏం చేశారు అనే ఒక కల్పిత కథ ఆర్ ఆర్ ఆర్. వారిద్దరూ ఒకరినొకరు ఎలా ప్రభావితం చేసుకున్నారు అనేది రాజమౌళి సినిమా. ఆలియా భట్ చరణ్‌కు జోడీగా నటిస్తారు. తారక్‌కు జోడీగా డైసీ అడ్గార్జియోన్స్ చేస్తున్నారు. అజయ్ దేవగణ్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక కీలకమైన రోల్ చేస్తున్నారు. సముద్రఖని కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన సినిమా మొదటి షెడ్యూల్ లో పాల్గొన్నారు. సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రామ్‌చరణ్, కొమురం భీం పాత్రను తారక్ చేస్తారు.
“సినిమాను 2020 జులై 30 తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇతర దేశాల నుంచి కూడా రిక్వెస్ట్స్ వస్తున్నాయి. అన్ని భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌చేస్తున్నాం” అని చిత్ర నిర్మాతలు దానయ్య చెప్పుకొచ్చారు. చిత్ర విడుదల సంవత్సరం పైగా ఉండడం విశేషం. సినిమా విడుదలకు చాలా టైమ్ ఉండడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్స్ ఈ సంవత్సరం అయితే ఉండదని రాజమౌళి కంఫర్మ్ చేసారు.
The general trend is that the urban population are generally slow and low when it…
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…