Telugu

రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ కొసం అందరు వెయిటింగే

దర్శకధీర రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో రూపోందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంని కొమరం భీమ్ టీజ‌ర్ ఈ నెల 22న విడుద‌ల కానుంది. బాహుబలి తరువాత రాజమౌళి సినిమా కావడం, నందమూరి మెగా కుటుంబాల మల్టీస్టారర్ చిత్రం కావడం.. రామ్ చరణ్ టీజర్ కు సెన్సషనల్ రెస్పాన్స్ రావడంతో ఈ టీజ‌ర్ కి యావత్తు ప్రేక్షకలోకం వేచి చూస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

రామ్ చరణ్ అల్లూరిగా కనిపించిన టీజర్ లో యాక్ష‌న్ పార్ట్ చూపించ‌టం దానికి ఎన్టీఆర్ వాయిస్ ఒవ‌ర్ ఇవ్వ‌టం చాలా హైలెట్ అయ్యింది. ఇప్ప‌డు స‌మ‌స్య ఇక్క‌డే స్టార్ట‌య్యింది. భీమ్ టీజర్ లో ఈ సారి ఎన్టీఆర్ యాక్ష‌న్ కి రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. ఇటు మెగా అభిమానులు , అటు నంద‌మూరి అభిమానుల మధ్య కొంత యాక్ష‌న్ స్టార్ట‌య్యింది.

ADVERTISEMENT

మా హీరో యాక్ష‌న్ బాగుంది, మా హీరో వాయిస్ వ‌ల్లనే టీజ‌ర్ బాగుందనే డిబేట్లు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా జరుగుతున్నాయి. తారక్ ది కంచుకంఠం కావడంతో బాగా హైలైట్ అయ్యింది… అయితే రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని ముందే గుర్తించి…. గట్టి కసరత్తే చేశాడట తన వాయిస్ ఓవర్ విషయంలో. పైగా ఇటువంటి విషయాలలో రాజమౌళి తీసుకునే కేర్ సంగతి తెలిసిందే.

సినిమాలో ఇద్దరు హీరోలు సమానంగా హైలైట్ అవుతారు అని రాజమౌళి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్‌, నంద‌మూరి ఫ్యాన్స్ ఇరువురు కూడా రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ కొస‌మే వెయిట్ చేయ‌టం విశేషం. మరోవైపు… సినిమాకు సంబంధించిన పది సెకండ్ల వీడియోని రామ్ చరణ్ కాసేపటి క్రితం విడుదల చేశాడు. ఆ చిన్న వీడియోతోనే ఈ రోజు నందమూరి అభిమానులకు నిద్రఉండదు అనడం అతిశయోక్తి కాదు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Ramayana Trolls: Should Ranbir Just Shut His Mouth?

Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…

38 minutes ago

Racist Attack on Telugus After UK Bathukamma Event

Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…

1 hour ago