
రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ ను రివీల్ చెయ్యకపోయినా హైప్ పెంచేలా ఉంది. ఉప్పు నిప్పుగా ఉండే నందమూరి, మెగా కుటుంబాల హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించి అప్పుడే థ్రిల్ చేశాడు రాజమౌళి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒళ్ళు గగ్గురుపొడిచేలా ఉంది. ఈ సినిమాకు ‘రౌద్రం, రణం, రుధిరం’ టైటిల్ ను ఫిక్స్ చేశాడు రాజమౌళి.
మిగిలిన భాషాల్లో మాత్రం ఆర్ఆర్ఆర్ అంటే రైస్, రోర్, రివోల్ట్ అని పెట్టారు. మరో వైపు ఆర్ఆర్ఆర్ ఇండియా 1920 అని కూడా పోస్టర్‌లో పెట్టాడు జక్కన్న. అంటే సినిమా అంతా స్వతంత్య్రానికి పూర్వం జరిగిన కథ అని అర్ధం అవుతుంది. అలాగే మోషన్ పోస్టర్ చివరలో సినిమా రిలీజ్ డేట్ మీద కూడా క్లారిటీ ఇచ్చేశాడు రాజమౌళి.
ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతి సందర్భంగా జనవరి 8, 2021న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా మరో సారి వాయిదా పడుతుందని వదంతులు వస్తున్నాయి. దీనితో అటువంటిది ఏమీ లేదని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు.
Last week was a fairly entertaining one for the Telugu OTT audience as we had…
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…