Telugu

ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ కు కుదిరిన ముహూర్తం… ఆ ఒక్కటీ అనుకూలిస్తే చాలు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం…ఆర్ఆర్ఆర్ విడుదల పై ఉన్న అనుమానాలను అన్నీ పటాపంచలు చేస్తూ చిత్రబృందం ఈరోజు తమ విడుదల తేదీని ప్రకటించాయి. అక్టోబర్ 13న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకుని రానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

ADVERTISEMENT

రామ్ చరణ్ గుర్రం మీద, ఎన్టీఆర్ బైక్ మీద వేగంగా దూసుకుపోతున్న గాండ్రిస్తున్న పోస్టర్ ని విడుదల చేశారు. సహజంగా దసరా పండుగకంటే ముందే విడుదల కావాల్సి ఉండగా… జేమ్స్ బాండ్ చిత్రం ‘నో టైం టు డై’ చిత్రం అక్టోబర్ 8న విడుదల కానుండడంతో దానికి కొంత గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 13న విడుదల చేస్తున్నారు.

బాహుబలి సినిమా తరువాత వస్తున్న రాజమౌళి చిత్రం అవుతుండడంతో దేశవ్యాప్తంగా సోలో రిలీజ్ దక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి చిత్రం విషయంలో ఉన్న ఒకే అనుమానం అప్పటికి ఓవర్సీస్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ అప్పటికి పరిస్థితులు చక్కబడకపోతే మాత్రం సినిమా వాయిదా పడొచ్చు.

అయితే అక్టోబర్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుండే ఆ తలంపు అనవసరం. మరోవైపు… గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా కొత్త టీజర్ విడుదల అవుతుంది అని ప్రచారం జరిగినా అటువంటి ప్రకటన ఏదీ రాకపోవడంతో అభిమానులు కొంత నిరాశపడ్డారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Allu Arjun vs Prabhas: Has Ram Charan Slipped Out of the Race?

The conversation around top stars in Telugu cinema seems to be shifting. For a long…

13 minutes ago

Vijaya Sai Returning To Politics, But When?

After being a loyal follower of the YS family for multiple decades, Vijaya Sai Reddy…

52 minutes ago