Telugu

తెలుగుదేశం పార్టీకి ‘రోజా’ దొరికింది!

అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడంలో సిద్ధహస్తురాలిగా వైసీపీ నేత రోజా ఏపీ రాజకీయాలలో ఎంతటి గుర్తింపును తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రోజా ఇలా అసభ్యకరంగా ఎంతలా వ్యాఖ్యానించగలదో, అంతేస్థాయిలో లాజిక్స్ తో కూడిన వ్యాఖ్యలు కూడా చేయగలదు. ఈ ప్రభావమే గత ఎన్నికలలో విజయం సాధించడానికి ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న రోజాకు కౌంటర్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మరో హీరోయిన్ ముందుకొచ్చింది.

ఒకప్పుడు టాలీవుడ్ తెరను ఒక ఊపు ఊపిన వాణి విశ్వనాధ్, ఇటీవల “జయ జానకి నాయక” సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించింది. ఈ సినిమాలో చేసింది కాసేపు పాత్రే అయినా మంచి గుర్తింపు తేవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న వాణి విశ్వనాధ్, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గనుక తనకు చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం నుండి రోజాకు ఎదురుగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే, తాను సిద్ధంగా ఉన్నానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ADVERTISEMENT

ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భావాలను వ్యక్తపరిచిన వాణి, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అనిర్వచనీయమని, ఆయన పాలన అంటే తనకు చాలా ఇష్టమని, ఇంతకాలం తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకునేందుకు అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టనని అన్నారు. త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలన్న కుతూహలం అయితే వాణి విశ్వనాధ్ లో కనపడుతోంది గానీ, వచ్చి రాగానే టికెట్ లభించడం మాత్రం అంత ఈజీ కాదన్న సంగతిని కూడా గుర్తుంచుకోవాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Paradise 22 Days Left: Can Odela Avoid Toxic Mistakes?

Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…

11 minutes ago

Kalki 2: Nag Ashwin Raises Major Doubts on Prabhas Film

Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…

40 minutes ago