Telugu

జగన్ గారు… రండి పాదపూజ చేసుకుంటాం..!

‘వకీల్ సాబ్’తో మొదలైన సినిమా టికెట్ల వివాదం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ సమసిపోకపోవడంతో… “ఆర్ఆర్ఆర్” చిత్ర నిర్మాణ సంస్థ తీవ్ర ఒత్తిడిలో ఉన్న విషయం బహిరంగ అంశమే. తొలుత వెలువడిన టాక్ ప్రకారం కోర్ట్ మెట్లెక్కుతారని భావించగా, దీనిని ఖండిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ… “టికెట్ల రేట్ల విషయంలో ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే గానీ, కోర్ట్ కు వెళ్లే ఉద్దేశం లేదని, ఏపీ సీఎం జగన్ తో చర్చించి పరిష్కరించుకుంటామని” అధికారికంగా తెలిపింది.

ADVERTISEMENT

కోర్టుకు వెళ్లి సీఎంతో తలనొప్పులు తెచ్చుకోవడం కన్నా, నేరుగా జగన్ తోనే చర్చలు చేయడం అనేది సమంజసమైన నిర్ణయమే. అలాగే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి “ఆర్ఆర్ఆర్” టీమ్ మరొక ప్లాన్ లో కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖ తీరాన చాలా అట్టహాసంగా నిర్వహించి, దానికి సీఎంను ముఖ్య అతిధిగా ఆహ్వానించి, అశేష అభిమానగణం నడుమ జగన్ ను భారీ స్థాయిలో సత్కరించే యోచన చేస్తున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

రానున్న రోజుల్లో ఈ అంశం మీద కూడా చిత్ర యూనిట్ స్పష్టత ఇస్తుందో లేదో తెలియదు గానీ, కొన్ని వందల కోట్లతో ఎంతో వ్యయప్రయాసలకు లోబడి చిత్రీకరించిన “ఆర్ఆర్ఆర్” చిత్ర ఓపెనింగ్స్ కోసం ‘సీఎం గారి పాదపూజ’కు సైతం సిద్ధం కావడం ఏపీలోని రాజకీయ ఆధిపత్యానికి అద్దం పడుతోంది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపించడంలో వైసీపీ సర్కార్ 100కి 1000 శాతం విజయవంతం అయ్యిందనే టాక్ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: cross link

Recent Posts

Netflix’s Much Hyped Film: Why Bollywood Fans Offended?

Netflix’s Best of the Best arrived on September 18 with an interesting premise: a Hollywood…

15 minutes ago

Rashmika on Her 90-Feet Waterfall Scene in Mysaa

Rashmika Mandanna is starring in an action role for Mysaa, which is a different type…

45 minutes ago